Breaking News

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం 18 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

-నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మోడ్రెన్ లాంగ్వేజ్ పేపర్ – II, జియోగ్రఫీ పేపర్ – II పబ్లిక్ పరీక్ష కు 18 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు గురు వారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 18 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 01 జనరల్ కేంద్రము లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మోడ్రెన్ లాంగ్వేజ్ పేపర్ – I, జియోగ్రఫీ పేపర్ – I పరీక్ష జరిగాయి. ఈ పరీక్షకు జనరల్ 18 మంది మొత్తం 18 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ. ఓ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *