Breaking News

న్యాయమూర్తి రవినాథ్ తిలహరికి సాధర పూర్వకంగా స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు పోలియో న్యాయమూర్తి రవినాథ్ తిలహరి శనివారం కృష్ణా జిల్లా కేంద్రంమైన మచిలీపట్నం నగరానికి నగరంలోని బెల్ అతిధి గృహం చేరుకోగా వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావు, ఆర్డిఓ స్వాతి సాధర పూర్వకంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా మొక్కలు అందజేశారు.

ఈ సందర్భంగా మచిలీపట్నం న్యాయస్థానాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సిహెచ్ వి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఏ వేణు ఆఫీస్ బేరర్లు మర్యాదపూర్వకంగా హైకోర్టు న్యాయమూర్తిని కలిసి తమ సంఘానికి విజయవాడలో సమావేశాలు నిర్వహించుకోవడానికి ఒక భవనం కేటాయించవలసినదిగా విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు చిన్నంశెట్టి రాజు, డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి  కె.వి రామకృష్ణయ్య, విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి  ఏ సత్యానంద్ విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి  శ్రీదేవి, అదనపు ఎస్పీ సత్యనారాయణ, డి.ఎస్.పి. సిహెచ్ రాజా, తహసిల్దారు మధుసూదన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *