Breaking News

నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మంత్రి మచిలీపట్నం నగరంలోని మున్సిపల్ కార్యాలయము, రాజా గారి సెంటర్ , బస్టాండ్ సెంటర్, జిల్లా కోర్టు సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో కాలినడకన పర్యటించి మురికి కాలువలను పరిశీలించారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్య ప్రధానమైన సమస్య అని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు మొత్తం రహదారులన్నీ జలమయం అవుతున్నాయన్నారు. మొత్తం జడ్పీ సెంటర్ నుండి ప్రధాన రహదారిలో దృష్టి పెట్టి లక్ష్మీ టాకీస్ సెంటర్, జిల్లా కోర్టు సెంటర్, బస్టాండ్ సెంటర్, కోనేరు సెంటర్, రాజుపేట వరకు కూడా ఎలా పరిష్కారం చేయాలో ఆలోచించామన్నారు. ఇందులో భాగంగా మొట్టమొదట మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బంది గత 20 రోజులుగా మురికి కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టారన్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించారని, వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కాలువలన్నింటిలో ఉన్న మురికి పూడికలను తక్షణమే తొలగించే పనులు చేపట్టాలని సూచించామన్నారు.

దాదాపు ఒక మీటరు కాలువలో కేవలం 2 అంగుళాలు నీరు ప్రవహిస్తోందన్నారు. కొన్ని డమ్మి అయిపోయాయని దీంతో నీటి ప్రవాహం జరగడం లేదన్నారు. ఆ ప్రకారం కాలువలు తెరచి మురికి పూడికలు అంతా తొలగింపు కోసం దాదాపు 80 నుంచి కోటి రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించామన్నారు. ఆ ప్రకారం వచ్చే 3 నెలల్లో పూర్తిగా పూడికలను తొలగిస్తామన్నారు. ఇందుకోసం అవసరమయ్యే 12 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని కోరామన్నారు. ఆ నిధులు వచ్చిన వెంటనే పనులన్నీ పూర్తి చేస్తామన్నారు.

ప్రధానంగా జిల్లా కోర్టు కాలువ సబ్ జైల్ కాలువ అంటారని పోలీస్ మైదానంలో పూడుకు పోయిందన్నారు. బస్టాండ్ నుంచి రైతు బజార్ ముందు కాలువలు శిథిలం అయిపోయాయన్నారు. ఆ కాలువలన్నింటిని అనుసంధానం చేసి ఎక్కడైనా రహదారులు, కల్వర్టులు గాని దెబ్బతిని ఉంటే వాటిని కూడా పూర్తి చేయాలని సూచించామన్నారు. మురికి కాలువలను నూటికి నూరు శాతం పూర్తి చేయడానికి, పంపింగ్ విధానం తో కలుపుకొని దాదాపు 164 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. రానున్న వర్షాకాలం నాటికి మురికి కాలువలు అన్ని సిద్ధం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆర్థిక శాఖ నిధుల కోసం ఈఎన్సీ సెక్రెటరీ నుండి మున్సిపల్ పరిపాలన కార్యదర్శికి దస్త్రం వెళ్లిందని అక్కడ నుండి ఆర్థిక శాఖకు పంపడం జరుగుతుందన్నారు.

నూరు శాతం కొట్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా బ్యాంకర్లతో మాట్లాడి ముద్ర రుణాలు, కార్పొరేషన్ రుణాలు అందించి ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. నగరంలో ప్రధానంగా కొన్ని పార్కులను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ వాటర్ బాడీ అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే మూడు స్తంభాల సెంటర్ వద్ద మడుగు పోరంబోకు స్థలంలో ఆక్రమణలు తొలగించామని అక్కడ మెరక చేయించి సుందరమైన పార్కులుగా అభివృద్ధి పరుస్తామన్నారు. ఉగాది నాటికి టీడ్కో జి ప్లస్ త్రీ గృహప్రవేశాల కార్యక్రమం చేయించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కొన్ని బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని అవి కూడా పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేపు 400 మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు. వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవలసి ఉందని రెండవ కంతు చెల్లించాల్సి ఉందన్నారు. ఈనెల 25వ తేదీలోగా వారు కంతులు చెల్లిస్తే రిజిస్ట్రార్ చెప్పి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులకు మున్సిపల్ కార్యాలయం నుండి ఫోన్లో కూడా వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు.

భవిష్యత్తులో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం వస్తుందని, దాంట్లో రెండున్నర లక్షల రూపాయల వ్యయంతో
గృహ నిర్మాణం పూర్తి చేసుకోవచ్చన్నారు. అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి 50 వేల రూపాయలు అదనంగా ఇస్తున్నామన్నారు. దీంతో 3 నుంచి 3:30 లక్షల రూపాయలు గృహ నిర్మాణం పూర్తి చేసుకోవచ్చన్నారు చేసుకోవచ్చన్నారు. రెండు సెంట్లు భూమి లేదా ఒక సెంటు భూమి ఎంత ఉందో ఒకసారి సమీక్షించుకొని కాలనీలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఆ కాలనీలలో రహదారులు, మురుగు కాలువలు, విద్యుత్తు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం సూర్యాఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. బీసీలకు 40 శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఇది కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా 20 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. మొత్తం 10 వేల ఇళ్లకు సోలార్ పలకాలు ఏర్పాటు కోసం ప్రణాళిక రూపొందించామన్నారు.

ఈ పర్యటనలో మంత్రి వెంట మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మోటమర్రి బాబా ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *