Breaking News

2024-25 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని  పారదర్శకంగా కొనుగోలు చేసేలా కార్యచరణ

-జిల్లాలో 216 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రాథమికంగా  2.00 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ..
-రబీ లో  పండిన ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ..
-ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి ఆర్ ఎస్ కె లని సిద్దం చెయ్యాలి
-మిల్లర్లు అధికారుల మధ్య సమన్వయం ముఖ్యం
-జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రస్తుత 2024-25 రబీ సీజన్లో  రైతు పండించిన ధాన్యానికి  ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించి, పండిన ధాన్యం సేకరణ కోసం ప్రాథమికంగా 2.00 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చెయ్యవలసి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ . చిన్న రాముడు పేర్కొన్నారు.

శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో 2024-25 రబీ సీజన్లో ధాన్యం సేకరణ పై రెవెన్యూ, పౌర సరఫరాల, వ్యవసాయ, సహకార , తూనికలు కొలతలు, రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టేక్ హోల్డర్స్, కాస్టోడియన్ అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు చేసేలా రైతు సేవా కేంద్రాలలో అన్నీ మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని రావాలని స్పష్టం చేశారు.  ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 216 రైతు సేవా కేంద్రాలను సిద్దం చేసి ఆమేరకు కొనుగోళ్లు చేపట్టడం జరగాలని ఆదేశించారు. కొనుగోళ్లు విషయంలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ కు ఖచ్చితంగా పాటించడం ముఖ్యం అన్నారు.  ఇప్పటి వరకు 6 సీజన్లలో ధాన్యం సేకరణ.చేపట్టడం జరిగిందని,  ప్రస్తుతం 7 వ సీజన్ కొనుగోలుకు సంబంధించి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణ పనులని నిబద్ధత కలిగి నిర్వర్తించాల్సి ఉంటుందనీ స్పష్టం చేశారు. మిల్లర్లు  జిల్లా యంత్రాంగం మధ్య అనుసంధానం అత్యంత కీలకం అన్నారు. గత సీజన్ ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్ల సహకారం అందించడం ద్వారా లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. ప్రస్తుత రబీసీజన్లో కూడా ఇదే రకమైన సహకారం అందించి జిల్లాను మొదటీ స్థానంలో నిలపాలన్నారు. రైతు సేవా కేంద్రాలకు అవసరమైన గన్ని బ్యాగులను సిద్దం చేసుకుని, రబీ సీజన్ ధాన్యం సేకరణ కు సహకారం అందించాలని కోరారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జెసి చిన్న రాముడు పేర్కొన్నారు. గతంలోనీ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సరియైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. సమావేశంలో వొచ్చిన సూచనలను మినిట్స్ నమోదు చెయడం ద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించవలసి ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో ఇంఛార్జి డి ఎస్ వో ఎస్. భాస్కర్ రెడ్డి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి రాధిక, ఇతర అధికారులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *