Breaking News

గృహనిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి.మంత్రి పార్ధ సారధి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరిత గతిన పూర్తి చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర గృహా నిర్మాణం,సమాచార,పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు.పార్ధసారధి గృహా నిర్మాణ శాఖ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసేరు.గృహనిర్మాణ శాఖ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రూపొందించిన 2025 వ సంవత్సరం డైరీ ని శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పార్ధ సారధి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను వచ్చే సంవత్సరం మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున లబ్ధిదారులలో అవగాహన కల్పించి నిర్మాణల పూర్తికి కృషి చేయాలని సూచించారు.కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని,ఉద్యోగులు కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలను సకాలంలో అమలు చేయడానికి కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేసేరు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహా నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  రాజబాబు,ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఓ.భాస్కరరావు,ప్రధాన కార్యదర్శి  దాశరధిశర్మ,గృహా నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజినీర్ శ్రీ పద్మనాభం,సూపరేండెంట్ ఇంజనీర్లు  జయరామాచారి, కృష్ణయ్య,జేఏసీ నాయుకులు  మల్లిఖార్జున రావు,వివిధ జిల్లాలకు చెందిన యూనియన్ నాయుకులు,ఉద్యోగులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *