Breaking News

తానా సభలకు మంత్రి శ్రీ పార్ధసారిదికి ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికా లోని డెట్రాయిట్‌లో జులై 3 4 5 తేదీలలో జరిగే తానా మహాసభలకు హాజరు కావలసిందిగా రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార,పౌర సంబందాల శాఖ మంత్రి శ్రీ కోలుసు పార్థసారథి గారిని మహాసభల ఆహ్వాన కమిటీ ఆహ్వానపత్రాన్ని అందించింది.శుక్రవారం ఆహ్వాన కమిటీ సభ్యులు శ్రీ పాతురి.నాగభూషణం,శ్రీ జయరాం కోమటి, శ్రీ శ్రీనివాస్ చందు తదితరులు విజయవాడలోని మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో మంత్రి గారిని కలిసి మహాసభలకు తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.మహా సభలు ఘనంగా జరగాలని,ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రయత్నం చేస్తానని మంత్రి కమిటీ సభ్యులకు తెలియ చేసేరు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *