Breaking News

వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు స్థాయికి చేర్చవలసిన బాధ్యత వ్యవసాయ విద్యార్థుల మీద వుంది

-కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీనివాస్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో గల వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం విద్యార్థులు RAWEP ప్రోగ్రామ్ లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమం కోరుకొండ మండలం, శ్రీరంగ పట్నం గ్రామం లో జరుగుతుంది. దీనిలో భాగంగా ఆఖరు రోజు అయిన ఏడవ రోజు రైతు సదస్సు తో పాటు శాస్త్రవేత్తలు రైతుల చర్చా గోష్టి నిర్వహించారు. ముందుగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తనఖాల నాగేశ్వరరావు చేతుల మీదుగా నూతన వ్యవసాయ విధానాల నమూనాలను తెలిపే స్టాల్స్ ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

గ్రామ సర్పంచ్, MPTC మరియు ఇతర గ్రామ పెద్దలు మరియు రైతులు ఈ స్టాల్స్ ని సందర్శించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు స్థాయికి చేర్చవలసిన బాధ్యత వ్యవసాయ విద్యార్థుల మీద వుంది అని చెప్పారు. ఆపై ఈ వారం రోజులు జరిగిన కార్యక్రమాలను NSS ఆఫీసర్ డా. H. శ్రీనివాస్ గ్రామస్తులకు తెలియజేశారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మల్లికార్జున్ మాట్లాడుతూ విద్యార్థులలో సామాజిక బాధ్యత పెంచే NSS కార్యక్రమం శ్రీరంగపట్నం వంటి ఆదర్శ గ్రామంలో చేయడం పిల్లలు చేసుకున్న అదృష్టం అని అన్నారు.

మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ నూతన విధానాల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని, నమూనాలను రైతులంతా చూసి నేర్చుకుని తమ పొలాల్లో అమలు చేయాలని చెప్పారు. సర్పంచ్ మద్దాల రమణ గారు మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులు రైతుల సమస్యల ఆధారంగా వ్యవసాయ ఆవిష్కరణలు చేసి రైతాంగానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. గ్రామ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు చేసిన సేవలను మెచ్చుకున్నారు. శాస్త్రవేత్తలు రైతుల చర్చా గోష్ఠి లో రైతులు తాము ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారాలను కళాశాల నుండి వచ్చిన ప్రొఫెసర్లు డా. వసంత భాను మరియు డా. దక్షిణా మూర్తి లను అడిగి తెలుసుకున్నారు. స్థానిక పాఠశాల విద్యార్థులు కూడా హాజరయ్యి వ్యవసాయ విద్య లో ఉన్న నూతన సాంకేతికతను ఆసక్తితో గమనించి తమ సందేహాలను వ్యవసాయ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. డా. సునీత ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల NSS ఆఫీసర్స్ డా.హెచ్.శ్రీనివాస్, డా. సునీత, కళాశాల సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రైతులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *