Breaking News

మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో పాల్గొన్ననగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో జరిగిన మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నకు ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ, ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ లు హాజరైన సదస్సులో నగర కమిషనర్ పాల్గొన్నారు. వర్క్ షాప్ లో మంత్రి మాట్లాడుతూ పారిశుధ్యం, తాగునీరు, స్ట్రీట్ లైట్లు, రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నుల వసూళ్లు చేయాలని, పన్నుల ఆదాయంతో అనవసరమైన భవనాలు కట్టకుండా, కనీస వసతుల కల్పనకు ఖర్చు పెట్టాలన్నారు. మున్సిపాలిటీల ఆదాయం ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్న సీఎం కి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామన్నారు. గుంటూరులో కుక్క కరిచి బాలుడు మృతి చెందడం చాలా బాధాకరమని, వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ పై దృష్టి పెట్టాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *