Breaking News

ఏక మొత్తంగా చెల్లించే ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ ఈ నెలాఖరు వరకు పొడిగింపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థకు ఆస్తి, ఖాళీ స్థల పన్నుల బకాయిలు ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ గురువారం జిఓ.ఎంఎస్ నం.66 ని జారీ చేసిందని, గుంటూరు నగరంలోని పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీని గత మార్చి నెలలో కల్పించిందని, తిరిగి ఈ నెల (ఏప్రిల్)ల్లో కూడా నెలాఖరు వరకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కావున ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని నగర పరిధిలోని పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

2025-26 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నును ఏప్రిల్ 30 నాటికి ఏక మొత్తంగా చెల్లిస్తే పన్నులో 5% రాయితీ
ఆస్తి పన్నుదారులు 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆస్తి పన్నును ఏప్రిల్ 30 నాటికి ఏక మొత్తంగా చెల్లించిన వారికి ఆస్తి పన్నులో 5% రాయితీ లభిస్తుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా జిఎంసి ప్రధాన కార్యాలయంలో 8, సర్కిల్ కార్యాలయంలో 6 ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళలకు మెయిన్ ఆఫీస్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశాన్నారు. ఈ కౌంటర్లు సెలవు రోజుల్లోనూ ప్రతి రోజు ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *