గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ ప్రముఖ పాత్ర వహిస్తుందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ అన్నారు. గురువారం స్థానిక గుంటూరు ఆర్‌డిఓ కార్యాలయం వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వే ఉద్యోగుల యూనియన్ బిల్డింగ్ నందు జరిగిన జాతీయ సర్వే దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, ఏడిజ సర్వే పవన్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్త దాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రక్త దాన శిబిరంలో గ్రామ, మండల సర్వేయర్లతో పాటు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, ఆర్‌డిఓ శ్రీనివాస రావు రక్త దానం చేశారు. మొత్తం 53 మండి ఉద్యోగులు ఈ రోజు రక్త దానం శిబిరంలో అందించిన రక్తాన్ని తల సెమియా వ్యాధి గ్రస్తులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ మాట్లాడుతూ ప్రజలకు భూమి అనేది ఒక ఎమోషనల్ అంశం అన్నారు. భూ పరిపాలనకు సంబంధించి భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ ప్రముఖ పాత్ర వహిస్తుందని కొనియాడారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 10వ తేదీన జాతీయ సర్వే దినాన్ని జరుపుకుంటున్నామన్నారు. సర్వే అనే వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకునేందుకు ఈ రోజు సర్వే శాఖ వారు సర్వే దినోత్సవ వేడుకులు జరుపుకోవటం జరుగుతున్నదన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది బాగా పని చేసిన సర్వేయర్లకు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ సర్వేయర్లకు ప్రశంస పత్రాలు అందించారు. ఎంతో ఉత్సాహంతో సర్వే శాఖ వారు రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సేకరించిన రక్తాన్ని తల సేమియా వ్యాధి గ్రస్తులకు అందించడం ఎంతో ముదావహం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రిసర్వే ను చక్కగా చేస్తున్నారని ప్రశంసించారు. రీ సర్వేలో చురుకుగా పాల్గొంటున్న సర్వేయర్లను అభినందిస్తు రాబోవు కాలంలో కూడా భూ సర్వే పనులు చక్కగా చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు.
రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు మాట్లాడుతూ జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం ఎంతో అభినందనిచ్చదగ్గ అంశం అన్నారు. ప్రజల భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ సిబ్బంది మరింత చురుక్కుగా సేవలు అందించాలని కోరారు.
Prajavartha Online Telugu News