Breaking News

దాతలు మరికొందరు ముందుకు వచ్చి రోగులకు సహాయ పడాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఛాతి మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల (ఫీవర్ హాస్పిటల్), గుంటూరు నందు డా.రఘు, సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో, దాతలు పోలిశెట్టి హరిప్రసాద రావు ఇచ్చిన ఆటో ఎనలైజర్ మెషిను, ఐ.టి.సి జనరల్ మేనేజరు పపన్ కుమార్  ఇచ్చిన ఎనస్తీషియ మెషీన్ ను, డా. రావెల పద్మావతి ఇచ్చిన వాటర్ కూలరు మరియు సిమెంటు బెంచీలు, మరియు ప్రభుత్వం నుంచి వచ్చిన క్రయో బ్రోంకోస్కోపి మెషినులను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ గురువారం ప్రారంభోత్సవం చేసి, దాతలను సన్మానించారు. దాతలు మరికొందరు ముందుకు వచ్చి రోగులకు సహాయ పడాలని కలెక్టరు కోరారు. ఈ కార్యక్రమలంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, ఎ.పి.హెచ్.ఐ.యం.డి.సి, డి‌ఈ ని హాస్పిటల్ లో కొన్ని మరమత్తులు మరియు ఉచిత భోజనశాల పైన షెడ్డు నిర్మాణినికి అంచనా వేయవలసినదిగా అదేశించారు.

ఈ కార్యక్రమంలో జి.జి.హెచ్ సూపరింటెండెంట్ డా.యస్.యస్.వి రమణ, వైస్ ప్రిన్సిపల్ డా.ప్రభాకర్, ఐ.టి.సి సీనియర్ మేనేజర్ గౌరి నాయుడు, జి. రఘ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *