విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేదారేశ్వరపేట 34 వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్ ఆధ్వర్యంలో శంకర నేత్ర చికిత్సాలయ సహకారంతో ఆదివారం కేదారేశ్వరపేట లోని వెలగపూడి లక్ష్మణదత్తు పాఠశాల ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగిన ఈ శిబిరంలో సుమారు 100 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 20 మందిని శస్త్ర చికిత్సలకు ఎంపిక చేసినట్లు నేత్ర వైద్యులు తెలిపారు. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కళ్ళ విషయంలో అందరం ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. శంకర నేత్ర చికిత్సాలయ వారి సహకారంతో మరెన్నో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శంకర్ నేత్ర చికిత్సాలయ వైద్యులు డాక్టర్ భాషి, డాక్టర్ ఝాన్సీ లక్ష్మి, డాక్టర్ సునీల్ బాబు, సిద్దు, జాకీర్ హుస్సేన్ ఎన్డీఏ కూటమి నేతలు బొడ్డు నాగలక్ష్మి, గడ్డం సాంబ,శృంగవరపు జగదీష్,ఆకులరవి శంకర్, కొండ, కొత్తపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News