Breaking News

కృత్రిమ మేధ పవర్ బి ఐ అంశాలపై 3 రోజుల శిక్షణ కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యంపి శివనాథ్ ఆధ్వర్యం లో కృత్రిమ మేధ పవర్ బి ఐ అంశాలపై 3రోజుల శిక్షణ కార్యక్రమం ను ఈ రోజు కళాశాల లో ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జాసింత క్వడ్రస్ ప్రారంభించారు.ఈ శిక్షణ ద్వారా మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా నైపుణ్యాలు విద్యార్థినులు కలిగి వుంటే మరిన్ని మెరుగైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందుకోవచ్చునని ఆమె తెలిపారు. ఈ మూడు రోజుల్లో శిక్షణ లో పవర్ బి ఐ కృత్రిమ మేధ శిక్షణ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని డేటా సోర్సెస్ అనుసంధానం చేయటం,సాంకేతికత సమస్యల పరిష్కారం అంశాల మీద శిక్షణ ఇచ్చిన తర్వాత ఉపాధి కల్పించటం కోసం యం పి కృషి చేస్తున్నారని యన్ టి అర్ జిల్లా యం యస్ యం ఈ కోఆర్డినేటర్ మాడగని గురునాథ్ తెలిపారు.అన్ని ప్రభుత్వ కళాశాలలలో కూడా ఈ విధమైన శిక్షణ ఇప్పస్తామని అందరూ ఈ అవకాశాన్ని అందిపుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో మార్పు ట్రస్ట్ డైరెక్టర్ సుయజ్,రిసోర్స్ పర్సన్ రామ్,మరియు డిగ్రీ ఫైనల్ ఎయిర్ విద్యార్థినులు , అధ్యాపకులు డా.భారత జ్యోతి పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వాగులు, వంకల వద్ద నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌

– వర్షాల వేళ ప్రజల భద్రత‌కు ప్రాధాన్య‌మిస్తూ చ‌ర్య‌లు – అధికారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశాలు – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *