గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం చుట్టగుంట జంక్షన్ వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశించిన సమయానికి అన్న క్యాంటీన్లలో ఆహారం అందించేలా, క్యాంటీన్లలో తగిన మౌలిక వసతులు అందేలా జిఎంసి సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. నోడల్ అధికారులు ప్రతి రోజు తప్పనిసరిగా క్యాంటీన్లను పరిశీలించాలన్నారు. క్యాంటీన్ కు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని, ఏ ఒక్కరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని అక్షయపాత్ర సిబ్బందికి స్పష్టం చేశారు. క్యాంటీన్ కు వచ్చే ప్రజలు తమ అభిప్రాయాలను క్యాంటీన్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియచేయవచ్చని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News