Breaking News

నోడల్ పర్సన్లకు ప్రాంతీయ వర్క్ షాప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రిన్సిపల్ సెక్రెటరీ, మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ మరియు డైరెక్టర్, మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు వారి ఆదేశములను అనుసరించి ది. 21 -04-2025 న వేసవి సెలవులు సంధర్భంగా కిశోరి బాలలకు ప్రత్యేక మైన కాలెండర్ ను రూపొందించి, కిశోరి వికాసం కార్యక్రమము పై అవహాహాన కలిగించుటకుగాను కొన్ని కార్యక్రమాలను నిర్వహిచుటకు గుంటూరు, పల్నాడు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాలలోని మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ నందలి సి.డి.పి.ఓ . లకు, నోడల్ ఆఫీసర్ల కు, జిల్లా బాలల పరిరక్షణాధికారులకు, వైద్య మరియు ఆరోగ్య శాఖ నందలి నోడల్ పర్సన్లకు, SERP నందలి నోడల్ పర్సన్లకు, గ్రామ, వార్డు సచివాలయాల నందలి నోడల్ పర్సన్లకు ప్రాంతీయ వర్క్ షాప్ ను UNICEF వారి సహకారముతో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, గుంటూరు వారి ఆద్వర్యం లో జిల్లా పరిషత్ సమావేశ మందిరము, గుంటూరు నందు నిర్వహించడమైనది.

ఈ ప్రాంతీయ వర్క్ షాప్ నందు కిశోరి వికాసం కార్యక్రమము కొరకు ప్రత్యకముగా రూపోందించిన కాలెండర్ ప్రకారము 02-05-2025 నుండి 10-06-2025 వరకు కిశోరి బాలకలకు వేసవి సెలవు లలో నిర్వహించవలసిన అవగాహానా కార్యక్రమాల గురించి కుమారి మేరీ జోన్స్, UNICEF టీం సభ్యులు పవర్ పాయింట్ ప్రెసజెంటేషన్ ద్వారా వివరించడమైనది. ఈ కార్యక్రమములో బాల్య వివాహాములు, ఋతు క్రమ పరి శుభ్రత, బాలల హక్కులు, పోషణ మరియు ఆరోగ్యము, లింగ సమానత్వము, విధ్య యొక్క ఆవశ్యకత, నైపుణ్యాభివృద్ది మరియు ఉపాది అవకాశాలు మొదలగు అంశముల గురించి చర్చించడమైనది. కిశోరి వికాసం కార్యక్రమము పై గ్రామ స్థాయిలో నిర్వహించవలసిన కార్యక్రమాల ప్రణాళిక పై జిల్లాల వారీగా కార్యాచరణ నివేదికను రూపోందించడమైనది.

ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా ఎం. శిరీష, జాయింట్ డైరెక్టర్, మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ, బి. మనోరంజని, జాయింట్ డైరెక్టర్, మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ, ఎస్. జయ లక్ష్మి, ప్రాంతీయ ఉప సంచాలకులు, మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ, కె.వి.ఏ. ఎస్. విజయ లక్ష్మి, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, గుంటూరు, విజయ లక్ష్మి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, కె. కమల్ కుమార్, ప్రోగ్రామ్ మేనేజర్ మరియు కుమారి నాగ మల్లేశ్వరి, ప్రోగ్రామ్ మేనేజర్ మొదలగు వారు హాజరు అవ్వడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *