Breaking News

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(PMGSY) పనులను తనిఖీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుచున్న ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(PMGSY) పనులను తనిఖీ చేయు నిమిత్తం నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ ఏజెన్సీ(NRIDA)కు చెందిన నేషనల్ క్వాలిటీ మానిటర్(NQM) బినయ్ కుమార్ సిన్హా తేదీ.21-04-2025 నుండి 25-04-2025 వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారని పంచాయతీ రాజ్ ఈ‌ఈ జి.బ్రహ్మయ్య నేడొక ప్రకటనలో తెలియజేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మంజూరు కాబడిన పనులను తనఖి చేయు నిమిత్తం వచ్చిన బినయ్ కుమార్ సిన్హా గుంటూరు గీత రెసిడెన్సీ(రూమ్.నెం.201)లో బస చేశారని వారి మొబైల్ నెం.9430320975 గా ఉన్నదని తెలియజేశారు. బినయ్ కుమార్ సింహా తేది.21-04-2025న ఉదయం 9.00 గంటలకు గుంటూరు నుండి బయలుదేరి నంబూరు-పెదవడ్లపూడి ఆర్అండ్బి రోడ్డును, పెదవడ్లపూడి నుండి కాజా-చిలువురూ రోడ్డు, చిలువురూ నుండి కొల్లిపర, చిలువురూ వయా కొల్లిపర(విజయవాడ-రేపల్లె కరకట్ట రోడ్డు)ను తనిఖీ చేసి సాయంత్రం 5.30 గంటలకు గుంటూరు చేరుకుంటారు. తేదీ.22-04-2025న ఉ.9-00 గంటలకు గుంటూరు నుండి బయలుదేరి వట్టిచెరుకూరు, లెమల్లెపాడు, అక్కడ నుండి కాకుమానులో బాపట్ల-పెదనందిపాడు ఆర్&బి రోడ్ తనిఖీ చేసి సాయంత్రం 6.00 గంటలకు గుంటూరు చేరుకుంటారు. తేది.23-04-2025న ఉ.9-00 గంటలకు గుంటూరు నుండి బయలుదేరి మామిళ్ళపల్లి(గ్రా) వియా కట్టెంపూడి జి‌బి‌సి‌ఆర్‌బి రోడ్ ను తనిఖీ చేసి పొన్నూరు చేరుకొని తిరిగి సా.4.00 గంటలకు గుంటూరు చేరుకుంటారు. తేది.24-04-2025న ఉ.10-00 గంటలకు గుంటూరు నుండి బయలుదేరి నారాకోడూరు, లెమల్లెపాడులో పూర్తయిన పనులను పరిశీలించి సా.4-00 గంటలకు గుంటూరు చేరుకుంటారు. తేది.25-04-2025న ఉ.9-00 గంటలకు గుంటూరు నుండి బయలుదేరి ఫిరంగిపురంలో గుంటూరు-నరసరావుపేట ఆర్&బి రోడ్ మేడికొండూరు వియా వేమవరం,113-తాళ్ళూరు పనుల పురోగతిని పరిశీలించి మ.3-00 గంటలకు గుంటూరు చేరుకుంటారని పంచాయతీ రాజ్ ఈ‌ఈ జి.బ్రహ్మయ్య ఆ ప్రకటనలో తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *