Breaking News

సీఎం చంద్రబాబు సేవలను స్పూర్తిగా తీసుకుని నిస్వార్ధంగా సేవ చేస్తున్నాం… 

-నాయకులు స్పందించటం లేదు
-పిఎమ్ కేఎం అధ్యక్షులు పసుపులేటి వెంకట రమణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సేవలను స్పూర్తిగా తీసుకుని టిడిపి పార్టీకి తాము నిస్వార్థంగా ఎటువంటి పదవులు అశించకుండా పలు సేవలు చేస్తూన్నామని అయితే తమకు పార్టీ పెద్దలు తగిన తోడ్పాటు ఇవ్వకపోవటం అవేదన కలిగిస్తుందని పిఎమ్ కేఎం అధ్యక్షులు పసుపులేటి వెంకట రమణ తెలిపారు. సోమవారం గాంధీ నగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు వజ్రోత్సవ వేడుక కార్యక్రమం చేయటం జరిగింది. ఆయన పేరు మీద పుస్తకాలు రాయటం జరిగిందన్నారు. ఇప్పుడు ఉన్న టీడీపీ నాయకులు అందరికంటే నిస్వార్ధంగా ఆయన పేరు మీద తాము అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తాము ఎంతో మంది టీడీపీ నాయకులను ఆహ్వానించటం జరిగిందని ఒక్క సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి హాజరవ్వలేదు. సహకారం అందించలేదు అన్నారు. తాము ఎవరిని ఒక్క రూపాయి అడగ టం లేదు. టీడీపీ నాయకులు ఒక్కరు కూడా చంద్రన్న వేడుకలకు రాలేదు అంటే మాకు చాలా బాధ కలుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు మీద ధర్మ చక్ర అనే సినిమా చేశాం. ఆయన గొప్పతనం గురించి అందులో వివరంగా ఉంటుందన్నారు. ఈ సినిమా ఆడియో మే 28న కడపలో జరిగే మహానాడులో రిలీజ్ చేస్తాం అన్నారు. అవకాశం లేకపోతే హైదరాబాద్ ఎన్ టి ఆర్ ఘాట్లో రిలీజ్ చేస్తాం అన్నారు. పార్టీ పెద్ద నాయకులు అయిన కొంతమందిని కలసి చంద్రబాబుతో అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగామని ఇవ్వలేదు అన్నారు. ఎమ్ ఎల్ ఏ లు ఆయన పేరు మీద వ్యాపారాలు చేసుకుంటు న్నారు తప్ప సేవ చేయటం లేదు. చంద్రబాబు నాయుడు నిజమైన వారసులుగా తామే అని గర్వంగా చెప్పుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *