గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యతతో కూడి రుచిగా ఉంటుందని, క్యాంటీన్ కి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శుక్రవారం ఆర్టీఓ కార్యాలయం వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో కలిసి టిఫిన్ చేస్తూ మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో అందించే ఆహారం రుచిగా ఉంటుందని, పేదలకు రూ.5కే నాణ్యమైన ఆహారం అందడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రోజువారీ మెనూ పై ప్రజలు అందించిన అభిప్రాయాల మేరకు కొన్ని మార్పులు కూడా చేయడం జరిగిందన్నారు. క్యాంటీన్ కు వచ్చే ప్రజలు తమ అభిప్రాయాలను క్యాంటీన్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియచేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి రోజు వచ్చే ప్రజలకు అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలన్నారు.
Prajavartha Online Telugu News