-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం నాటికి గుంటూరు నగరంలో గుర్తించిన గార్బేజ్ వల్లరబుల్ పాయింట్స్ లో ప్రజలు చెత్త వేయకుండా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని, దానికి పబ్లిక్ హెల్త్ మరియు ఇంజనీరింగ్ విభాగాల వారు కో ఆర్డినేషన్ తో పనిచేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఎ.ఈ లను యస్.ఐ లను ఆదేశించారు. శుక్రవారం నగరంలో గార్బేజ్ పాయింట్స్ లేకుండా చేయుటకు కౌన్సిల్ సమావేశ మందిరం నందు పి.హెచ్ మరియు ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశం నందు తొలుత శానిటరీ డివిజన్ల వారీగా వారి ప్రాంతాలలో ఉన్న గార్బేజ్ వల్లరబుల్ పాయింట్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్ని డివిజన్లలో 338 గార్బేజ్ వల్లరబుల్ పాయింట్స్ ఉన్నాయని, ఇక నుండి సదరు గార్బేజ్ పాయింట్స్ లో ప్రజలు చెత్త వేయుటానికి వీలు లేదన్నారు. గార్బేజ్ పాయింట్స్ లో చెత్త వేయకుండా ఉండుటకు సదరు ప్రాంతాలలో ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో గ్రీన్ మ్యాట్ లను ఏర్పాటు చేయాలని ప్రజారోగ్యాదికారులను ఆదేశించారు. గ్రీన్ మ్యాట్ లను ఏర్పాటు చేసిన అనంతరం సదరు ప్రాంతంలో చెత్త వేయరాదని బోర్డులను ఏర్పాటు చేయించాలన్నారు. అయినప్పటికీ ఎవరైనా చెత్త వేస్తుంటే సదరు ప్రాంతాలలో వర్కర్ల చేత నిఘా ఏర్పాటు చేసి, చెత్త వేసే వారికి అపరాధ రుసుం విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. సోమవారం నాటికి గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసింది లేనిది ప్రత్యేకంగా బృందాల చేత తనిఖీ చేయించుటయే కాక తాము కూడా ప్రత్యక్షంగా తనిఖీ చేస్తామన్నారు. బుధవారం నుండి సదరు ప్రాంతాలలో చెత్త పది ఉంటె సంబధిత శానిటరీ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకొనుట జరుగుతుందని హెచ్చరించారు. నగరంలోని అనధికార చికెన్, మటన్ మరియు ఫిష్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారని, అనధికారికంగా ఏర్పాటు చేసున్న చికెన్, మటన్ మరియు ఫిష్ మార్కెట్ల పై చర్యలు తీసుకోవాలని, సదరు షాప్ లను సీజ్ చేయుటయే కాక అపరాధ రుసుం కూడా విధించాలని ఆదేశించారు. అలాగే నైట్ శానిటేషన్ పక్కాగా జరగాలని ఈ రోజు నుండి నైట్ శానిటేషన్ పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేయుట జరుతుందన్నారు. డివైడర్లు మరియు ఫుట్ పాత్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, ప్రతి రోజు మధ్యాన్నం హాజరు తీసుకున్న అనంతరం ఇంటర్నల్ రోడ్లలోని సైడు కాలువలను విధిగా శుభ్రం చేయించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ లను ఆదేశించారు.
సదరు సమావేశంలో యస్.ఈ నాగమల్లెస్వర రావు, సి.యం.హెచ్.ఓ డాక్టర్ అమృతం, యమ.హెచ్.ఓ డాక్టర్ రవిబాబు, ఈ.ఈ సుందరరామి రెడ్డి, వేటర్నరి అసిస్టెంట్ సర్జన్ వెంకటేశ్వర రావు, యస్.యస్ లు, ఏ.ఈ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News