గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిఎంసి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరుగుతుందని, క్యాంప్ లో పాల్గొనే ఆసక్తి కల్గిన 14 ఏళ్లలోపు బాలబాలికలు స్టేడియం, స్విమ్మింగ్ పూల్ లలో శనివారం నుండి అందుబాటులో ఉండే దరఖాస్తులు పూర్తి చేసి ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 31 వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం 6 నుండి 8 గంటల వరకు, సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు క్యాంప్ జరుగుతుందన్నారు. క్యాంప్ లో అధ్లెటిక్స్, బాస్కెట్ బాల్, స్కేటింగ్, టెన్నిస్, షటిల్ బ్యాట్మింటన్, చెస్, యోగా&ధ్యానం, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ అంశాల్లో శిక్షణ ఇస్తారన్నారు. నెల రోజుల శిక్షణ అనంతరం జరిగే క్యాంప్ ముగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్లు, బహుమతులు అందిస్తామని తెలిపారు.
Prajavartha Online Telugu News