Breaking News

పరిపాలన వ్యవస్థ, అధికారుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఐ వి ఆర్ ఎస్ ద్వారా పౌర సేవలు అందించే క్రమంలో పరిపాలన వ్యవస్థ, అధికారుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల పనితీరు పై ఐ వి ఆర్ ఎస్ ద్వారా వొచ్చిన ఫిర్యాదులను స్వీకరించడం, వాటికి సంబంధించి పరిష్కారం కోసం అవగాహన (perception) తప్పని సరిగా కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు, పరిశుభ్రత, వివిధ వైద్య పరీక్షలు సేవలు, మందుల పంపిణీ, తదితర అంశాలపై, ఏపీ ఎస్ ఆర్టిసి , ఎక్సైజ్, మైన్స్, డీ ఆర్ డి ఎ, పౌర సరఫరాల, జిల్లా గ్రామ పంచాయతీ, రెవెన్యూ , అన్నా క్యాంటీన్ తదితర విభాగాల్లో పౌర సేవలు అందించే క్రమంలో ప్రజలు వివిధ అంశాలకి చెందిన ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. వాటిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని, ఆయా ఫిర్యాదుల దారులతో నేరుగా సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించే క్రమంలో అవగాహనా కలుగ చెయ్యడం కోసం ఐ వి ఆర్ ఎస్ ఫీడ్ బ్యాక్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నట్లు తెలిపారు.. గ్రామ, వార్డు సచివాలయం వ్యవస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇందు కోసం ఆయా అర్జీ, ఫిర్యాదు దారులతో మాట్లాడి సంతృప్తి చెందేలా పరిష్కరం మార్గం పై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి సీతారామ మూర్తి, ఇంచార్జీ డి ఎస్వో ఎస్. భాస్కర్ రెడ్డి, పిడి డిఆర్ డి ఏ ఎన్ వి వి ఎస్ మూర్తి, డిపివో వి. శాంత మణి, డి ఎల్ డి వో లు ఏ. స్లీవా రెడ్డి, పి వీణా దేవి, తడుతరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *