అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భ్రుతి 10 వేల నుండి 20 వేలకు పెంచుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ముదావహమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు అంటే 61 రోజులపాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా ఇంటికే పరిమితం కావలసి ఉంటుందని, ఆ సమయంలో మత్స్యకారుల జీవనం కోసం, వారి కుటుంబాలకు ఇచ్చే భ్రుతి ని రెట్టింపు చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు లబ్ది చేకురుస్తున్నారని అయన అన్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 13077 మంది మత్స్యకార కుటుంబాలకు 26.15 కోట్లు ఈరోజున జమచేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా, మత్యాకరులకు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో 20 వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తం గా మొత్తం 258 కోట్లు జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లలో చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే 2014-19 మధ్య కాలంలో మత్స్యకారులకు వలలు, పడవలు ఐస్ బాక్సులు రాయితీలపై ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సి ఎస్ ఆర్ నిధులతో నాగాయలంక మండలం గుల్లల మొదలో 6 కోట్ల రూపాయల వ్యయంతో జేట్టిల నిర్మాణం, ఫిష్ డ్రై ప్లాట్ ఫారంలు . ఆరోగ్య కేంద్రం, రెండు పెద్ద మర పడవలు, చేపల రవాణా నిమిత్తం ఒక వాహనం తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇప్పటికే ONGC వంటి సంస్థల సహకారంతో మత్స్యకారులకు ఐస్ బాక్సులు అందచేశామని తెలిపారు.
చేపల వేట సమయంలో మత్స్యకారులు మరణిస్తే 10 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నారని, వేటకు వెళ్ళే మర పడవలకు 3 వేల లీటర్లు,( మోటార్ బోట్లకు 300 లీటర్ల చొప్పున ) లీటర్ కు 9 రూపాయల చొప్పున డీజల్ రాయితీ ఇస్తున్నారని అన్నారు. మత్స్యకారులు ఎక్కువగా ఉండే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అవనిగడ్డ నియోజక వర్గంలో నాగాయలంక, కోడూరు మండలాలు, పెడన నియోజక వర్గంలో పెడన, బంటుమిల్లి, కృతివెన్ను మండలాల లోని మత్స్యకారులు ఇలాంటి ప్రభుత్వ చర్యల వలన ఆర్ధికంగా నిలదొక్కు కుంటారని ఎంపి బాలశౌరి వివరించారు.
Prajavartha Online Telugu News