Breaking News

ప్రపంచ పశువైద్య దినోత్సవం – 2025

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల జీవన విధానంలో భాగమైన జంతువులకు అత్యున్నత స్థాయి సంరక్షణను అందించటంలో పశువైద్యులతో పాటు, ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు.
శనివారం స్థానిక కొత్తపేట లోని జిల్లా పశువైద్యశాలలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవం – 2025 లో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యంతో అనుసంధానమై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని, మా నాన్నగారు కూడా వెటర్నరీ డాక్టర్ గా మధురై పరిసర ప్రాంతంలో సేవలు అందించారని, మేము ఎక్కడ పర్యటించిన ఆ ప్రదేశంలో కూడా పశు వైద్యశాలల గురించి మరియు పశువైద్య సేవల గురించి విచారించి మమ్మల్ని కూడా పశు వైద్యశాలకు తీసుకుని వెళ్లే వారని, పశువైద్యంతో మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. ఇక్కడ కూడా పశువైద్య సేవలు బాగా జరుగుతున్నాయని కొనియాడారు. ఇటీవల ఒక ఆవుకు రోడ్డు ప్రమాదం లో కాలు విరిగినప్పుడు హైకోర్టు న్యాయమూర్తి గారు చూసి జిల్లా సంయుక్త సంచాలకుల వారికి సమాచారం చేరవేసిన వెంటనే దానికి శస్త్ర చికిత్స చేయించి సరిచేసి యధావిధిగా నడిచే విధంగా మెరుగైన వైద్యసేవలు అందించినందుకు అభినందిస్తున్నానన్నారు. గ్రామంలో పశుసంపద వల్ల ప్రజలు జీవనోపాధి మెరుగు పడుతుందని, పట్టణాలలో పెంపుడు జంతువులు పెంపకం పట్ల కూడా ఇష్టాన్ని చూపుతున్నారన్నారు. వన్యప్రాణులతో పాటు సమాజంలో ప్రజలతో జీవిస్తున్న జంతువుల సంరక్షణ పై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో పెంపుడు జంతువులతో పాటు వీదీ కుక్కలు, పిల్లుల సంరక్షణకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ పశు వైద్యశాలలో జంతువులకు నాణ్యమైన వైద్యసేవలను అందిస్తున్నారన్నారు. జంతువుల ఆరోగ్య సంరక్షణలో నిరంతరం కృషి చేస్తున్న పశువైద్యులకు, వెటర్నీ పారమెడికల్ సిబ్బందికి, జంతు ప్రేమికులకు, స్వచ్ఛంద సేవ సంస్థలకు అంతర్జాతీయ పశువైద్య దినోత్సవం సంధర్భంగా ప్రత్యేకంగా దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్.ఒ.నరసింహారావు మాట్లాడుతూ ప్రపంచ పశు వైద్య దినోత్సం 2025 ను “పశు ఆరోగ్యం – ఒక బృందం” అనే థీమ్ తో జరుపుకుంటున్నామన్నారు. జంతువులకు అత్యున్నత స్థాయి సంరక్షణ, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించటానికి పశువైద్య బృందాలు, నిపుణులు కలిసి పనిచేయాలన్నదే ఈ థీమ్ ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. అన్ని తరగతుల వారికి కలుపుకొని ప్రజలు అవసరాలైన మాంసము, గుడ్లు మరియు పాల ఉత్పత్తుల్లో పశువైధ్యులు అందరు ప్రముఖ భూమిక పోషించి మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కోరారు. నూతన పశువైద్యశాల భవనాలకు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ గారు 14 లక్షల రూపాయలను కొర్పోరేట్ సోషల్ రెస్పోన్స్బిలిటీ (CSR) ద్వారా మంజూరు చేయడం గుంటూరు జిల్లా పశు వైద్యులందరికీ ఆనందదాయకమని అన్నారు.
ప్రభుత్వ పశువైద్యశాలలో నూతన భవనాల నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులు ద్వారా రూ. 14 లక్షలు కేటాయించినందుకు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీని పశువైద్యశాలలోని వైద్యులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో విజేతలు అయిన వారికి బహుమతులు పంపిణీ చేసి, వివిధ రంగాలలో నిష్ణాతులైన విశ్రాంత పశువైద్యులు డాక్టర్. డి. రజనీకాంత్ మరియు డాక్టర్.ఆర్. లక్ష్మీ ప్రసాద్ లను ఘనంగా సత్కరించారు. అనంతరం “ఒన్ హెల్త్” ఉద్దేశం , పశు వ్యాదుల పై సాంకేతిక సదస్సు నిర్వహించారు.
కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ కె.వి.వి. సత్యనారాయణ గారు, డాక్టర్. యామ్. రత్నజ్యోతి గారు, రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ వై. ఈశ్వర్ రెడ్డి, జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ . యమ్ వెంకటేశ్వర్లు, ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్.కె. సాంబశివరావు మరియు జిల్లా పశు వైద్య వైద్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *