Breaking News

“వేసవి విజ్ఞాన శిఖరాలు”పోస్టర్ ఆవిష్కరన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడు “వేసవి విజ్ఞాన శిఖరాలు”పోస్టర్లు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో ది:28/04/2025 నుండి 06/06/2025 వరకు 40 రోజు లు పాటు వేసవి విజ్ఞాన శిఖరాలు నిర్వహించబడును.ఈ వేసవి విజ్ఞాన శిఖరాలు ఉదయం :8:00 గంటలకు నుండి 11:00 గంటల వరకు నిర్వహించబడును. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను పంపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ గ్రంథాలయాల నందు కధలు చదివి వినిపించడం, పుస్తకాలు చదవడం, పుస్తక సమీక్షలు, కధలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లీష్/డ్రాయింగ్/పెయింటింగ్/పేపర్ క్రాఫ్ట్స్/డ్యాన్స్/పప్పెట్ మేకింగ్/చెస్/క్యారమ్స్/Qize/జికె మరియు ఇతర అంశాలు నేర్పబడును. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీమతి వంకదారి సుబ్బరత్నమ్మ, ఉపగ్రంధపాలకురాలు శ్రీమతి కె.ఝాన్సీ లక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ యం.సీతారామయ్య, లైబ్రేరియన్స్ కె.చిన్నపరెడ్డి,యన్.నాగిరెడ్డి, బ్రహ్మయ్య, రాజేష్, విజయ్ కుమార్, సంజయ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *