Breaking News

లక్ష్య సాధనకు ప్రతి రూపం భగీరథుడు

-సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యం
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భగీరథుని జీవితం నుంచి మనం స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపు ఇచ్చారు. ఆదివారం కలెక్టరేట్ లో భగీరథ మహర్షి జయంతి వేడుకలలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ.. దివి నుంచి భువికి గంగను తీసుకుని రావాలన్న భగీరథుని లక్ష్యం.. చిత్తశుద్ధి, కఠోర సాధన ద్వారానే సాధ్యం అయిందని చెప్పారు. భగీరథుని జీవితం నుంచి ప్రతి ఒక్కరూ స్పూర్తి పొందాలన్న ఉద్దేశ్యం తో ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. గంగను దివి నుంచి భువికి తీసుకు రావాలన్న లక్ష్యాన్ని చిన్నతనంలోనే నిర్దేశించుకొని నిరుత్సాహ పడకుండా ప్రయత్నించి సఫలీకృతం అయ్యారన్నారు. వయస్సు చిన్నదైన లక్ష్యం పెద్దది అని..అయినా అకుంఠిత దీక్ష తో అనుకున్న లక్ష్యాలను సాధించిన వ్యక్తి భగీరథుడు అన్నారు. సంగం నీళ్ళు ఉన్న గ్లాసును చూసి … “సగం నీళ్ళు మాత్రమే ఉన్నాయని” ప్రతికూల స్వభావం కలిగి ఉన్న వ్యక్తులు భావిస్తే, సానుకూల స్వభావం కల వారు “గ్లాసు ఖాళీగా ఉండకుండా సగం నిండి ఉంది” అని ఆశావహ దృక్పథం కలిగి ఉంటారని చెప్పారు. ఎప్పుడు సానుకూల ఆలోచనా ధోరణి కలిగి ఉంటామో, అప్పుడు అనుకూల ఫలితాలు సాధ్యం అవుతాయని పేర్కొన్నారు. బృహత్తర లక్ష్యాలను సాధించిన వారి నుంచి ప్రేరణ పొందాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సానుకూల వైఖరి అవసరమని తద్వారా మెరుగైన ఫలితాలు సాధించడం సాధ్యం అవుతుందని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి టి.సీతారామ మూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె. ఎన్. జ్యోతి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *