Breaking News

శంకుస్థాపనలన్ని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించినవే తప్ప ఈ సభ లో కొత్తగా ప్రకటించినవి కాదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు ను నిర్మించడం రాష్ట్ర ముఖ్యమంత్రి కి సాధ్యమేనని రాష్ట్ర సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించడం చూస్తే “ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు ఉందని” సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు ఒక ప్రకటన లో విమర్శించారు. మొన్నటి అమరావతి పునర్ నిర్మాణ సభ చాలా విజయవంతం అయ్యిందని ముఖ్యమంత్రి తో సహా అధికార పార్టీల నాయకులు ఆనందిస్తున్నారు. కానీ ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరస్పరం పొగడ్తలకె పరిమితం అయ్యారు. రాజధాని నిర్మాణానికి, రాష్ట్రనికి ప్రత్యేక హోదా, వెనుక బడిన రాయలసీమ, ఉత్తరంద్ర ప్రాంతాల అభివృద్ధికి కొత్తగా నిధులు కేటాయించడానికి ప్రధాని నూతనంగా ప్రకటించడానికి ముఖ్యమంత్రి కనీసం సభా ముఖంగా కోరడంలో కూడా ఘోరంగా విఫలం అయ్యారు. శంకుస్థాపనలన్ని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించినవే తప్ప ఈ సభ లో కొత్తగా ప్రకటించినవి కాదు. 2014లో అధికారం లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ జిల్లా ల్లో గుండ్రవుల, వేదవతి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం నిర్మాణం లో ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో శ్రద్ద లేదు. పోలవరం పూర్తి అయితే తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల నుండి నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్ లు కూడా లేవు.సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ప్రస్తావన లేదు.గత ప్రభుత్వం లో వరదలకు కొట్టుకొని పోయిన ప్రాజెక్టులకు మరమ్మతుల కు నిధులు కూడా లేవు. వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా 65 వేల కోట్ల రూపాయలతో పోలవరం -బనకచర్ల అనుసంధానం చేస్తానని ముఖ్యమంత్రి కొత్త గా వాగ్దానం చేయడం కేవలం రాష్ట్ర ప్రజలను, రాయలసీమ ప్రజలను మభ్యపెట్టడమే తప్ప మరొకటి కాదు. రాజధాని పునర్ నిర్మాణంకు కూడా ప్రధాని కేంద్రం నుండి నిధులు ప్రకటించలేదు. రుణాలతోనే నిర్మాణ పనులకు సిద్ధం అయ్యారు. ఈ అప్పులకే పరిమితం కాకుండా భారీ ప్రాజెక్టులకు, ఐ కాన్ టవర్ నిర్మాణానికిమరో 30వేల కోట్ల రుణాలతో సిద్ద మవుతున్నారు. వాస్తవాలకు అనుగుణంగా కేంద్రం నుండి రాష్ట్రఅభివృద్ధి కి ప్రత్యేక నిధులు రాబట్టెందుకు ముఖ్యమంత్రి కృషి చేయాలి. ప్రధాని ఈ సారైనా ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు వాగ్దానాలు చేస్తారన్న ఆశించిన రాష్ట్ర ప్రజలకు తీవ్రనిరాశ కల్గిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు ఒక ప్రకటన లో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *