విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్న జాతీయ రైతునాయకుడు రాకేష్ తికాయత్ పై సంఘపరివార శక్తులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.ఈశ్వరయ్య, కె. వి.వి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ రూపొందించిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన రైతాంగ ఉద్యమంలో రాకేష్ కాయత్ ప్రధానమైన పాత్ర పోషించారన్నారు. మూడు నల్లవ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్న కేంద్రప్రభుత్వం మరో మారు ప్రమాదకరమైన చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టే ప్రయత్నంలో ఉందన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా మరో సారి దేశ వ్యాప్త ఉద్యమానికి సమాయత్తమవుతుండగా రైతు ఉద్యమాన్ని బలహీనపరచడానికి తికాయత్ పై దాడికి పూనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు.
పహల్ గావ్ ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా శుక్రవారం ముజఫర్ నగర్ ర్యాలీలో పాల్గొన్న తికాయత్ సభలో ప్రసంగించేందుకు వేదిక మీదకు చేరుకున్న వెంటనే మూక శక్తులు తికాయిత్ పై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు మతోన్మాద శక్తులు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయన్నారు .మత శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై దాడి చేసే దుష్ట సంప్రదాయ సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలని వారు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 6 తేదీన విజయవాడలో జరిగే రైతు సంఘాల సమావేశంలో చర్చించి తికాయత్ పై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామన్నారు.అదే విధంగా తికాయత్ పై జరిగిన దాడిని ఖండిస్తూ రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు నిరసనలు వ్యక్తం చేయాలని వారు ఆ ప్రకటనలో కోరారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News