-ఈదురు గాలులు వలన ప్రమాదకర హార్డింగ్ తొలగింపు లో అధికారులు సమయమనంతో వ్యవహరించాలి
-నదీ తీరంలో ఉన్న గ్రామ పంచాయతీ అధికారి, కార్యదర్శి అప్రమత్తంగా ఉండాలి
-నదీ తీరంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
-టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేసిన..
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అకాల వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో కోతలు పూర్తి చేసిన ధాన్యం సేకరణ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానికంగా నీట్ పరీక్షలు కేంద్రాలను తనిఖీ చేసే క్రమంలో క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో 216 రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రస్తుత రబీ సీజన్లో 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యంలో ఇప్పటి 2,63,076 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేసి, లక్ష్యాలను అధిగమించడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,79, 689 మెట్రిక్ టన్నుల ధాన్యం కోతలు పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. అనపర్తి నియోజక వర్గంలో 25,800 మెట్రిక్ టన్నుల ధాన్యం కోతలు పూర్తి కాగా 17,903 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. అదే విధంగా గోపాలపురం లో 32,105 ఎమ్ టి లకు, 30,038 ఎమ్ టి లు , గోకవరం మండలం లో 8758 ఏం టి లకు 8,637 ఎమ్.టీ లు , కొవ్వూరు పరిధిలో 70,479 కి 67,928 ఎమ్ టి లు , నిడదవోలు లో 89,099 ఎమ్ టి లు , రాజమహేంద్రవరం రూరల్ లో 14,782 ఎమ్ టి లకు గాను 14,605 ఎమ్ టి లు , రాజానగరం మండలం పరిథిలో 38,641 మెట్రిక్ టన్నుల ధాన్యం కోతలు పూర్తి కాగా వాటిలో 37,911 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగిందని తెలిపారు.
ఇంకా కోతలు పూర్తి చేసిన వాటిలో 16,613 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా తగిన సూచనలు ఇవ్వడం, మిల్లులకు తరలించడం పై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు.
గోదావరి పరివాహక నదీ తీరంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రమాదకర హోర్డింగులు విషయంలో, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్స్ విషయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. నగరంలో, మునిసిపల్ పరిధిలో, మండల కేంద్రాల్లో భారీ హోర్డింగ్ విషయంలో వాటి సురక్షిత, పటిష్టత విషయంలో తనిఖీలు చేయాలన్నారు. సరైన నిర్వహణ, పటిష్టత లేని వాటిని తొలగించే క్రమంలో సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్దేశించిన స్నాన ఘట్టాలలో స్నానాలు చేయడం కోసం మాత్రమే అనుమతించాలని, ప్రమాద ఘటనలు నేపధ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో హెచ్చరికలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. గోదావరీ తీరం లో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇటీవల గోదావరి నదిలో మునిగి మరణాలు సంభవించడం దురదృష్టకరమన్నారు. అటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు. అందుకు సంబంధించి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డీవోలు జిల్లా అధికారులు తాసిల్దారులు మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News