Breaking News

భారీ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి

-త్రాగునీరు,పారిశుధ్యం,విద్యుత్ సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరించాలి
-అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలి
-జిల్లాలో అవసరాల మేరకు భద్రత చర్యలు ,సమాచార, సహాయ సహకారాల కేంద్రాలు పక్కాగా ఏర్పాటు చేయాలి ..రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి
-అకాల వర్షం కారణంగా జిల్లాలో మరియు నూజివీడు నియోజకవర్గంలో మామిడి పంట నష్టం పూర్తి వివరాలు తెలియజేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రి ,

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
అకాల వర్షాలు కారణంగా అధికారులను అప్రమత్తంగాఉండాలని, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశించారు.జిల్లాలో ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గంలో అకాల వర్షం కారంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు, సహాయ సహకార కేంద్రాలు, నివారణ చర్యలు చేపట్టాలనీ అధికారులను ఆదేశించారు.జిల్లా ,మండల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్, మెడికల్,అగ్రికల్చర్, ఇరిగేషన్,పంచాయతీరాజ్, ఆర్&బి, అధికారులందరూ సమన్వయంతో పని చేసి నష్టనివారణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ అంతరాయం, త్రాగునీరు,సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు, నూజివీడు నియోజకవర్గంలో హార్టికల్చర్ ,మామిడి పంట నష్ట వివరాలు పూర్తి నివేదిక సమర్పించాలన్నారు,అవసరం మేరకు మెడికల్ క్యాంపులు,ఏర్పాటు చేయలన్నారు, ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు,రహదారుల అంతరాయం తక్షణమే నివారించాలన్నారు, అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు,

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *