Breaking News

అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్

-గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు
-సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి తన ప్రాణాలను సైతం అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజనుల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితులను చూసి చలించిపోయి వారి సంక్షేమమే ధ్యేయంగా బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరము నందు SETVEN వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు..

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. విశాఖ జిల్లా పాండ్రంగి లో 1897 జులై 4 న అల్లూరి సీతారామరాజు జన్మించారని వారి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సాధ్యమని నమ్మి తన ప్రాణాలను సైతం అర్పించిన మహాయోధులు అల్లూరు సీతారామరాజు అన్నారు. గిరిజన ప్రాంత ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షనురగిలించడంలో అల్లూరి సీతారామరాజు ప్రముఖ పాత్ర పోషించారు అని అన్నారు. భారతదేశంలో బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడీపై గిరిజన ప్రజలలోచైతన్యం కలిగించడంలో ప్రత్యేక కృషి చేశారని కొనియాడారు. కావున అల్లూరి సీతారామరాజు ఆదర్శాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తి గా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో setven సీఈవో మోహన్ కుమార్, దేశ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *