తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెంకటగిరి నియోజకవర్గo, శాసనసభ్యులు చేతుల మీదుగా మెగా జాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో 15-05-2025 తేదీన అనగా గురువారం, ఉదయం 8 గంటల నుంచి వెంకటగిరి లోని విస్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల(Visvodaya Govt Degree College, Venkatagiri) నందు జరగబోయే మెగా జాబ్ మేళా కొరకు ఈరోజు ముఖ్య అతిథులుగా కురుగొండ్ల రామకృష్ణ, శాసనసభ్యులు, వెంకటగిరి నియోజకవర్గo, వారి చేతుల మీదుగా మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది.
ఇందులో భాగంగా కురుగొండ్ల రామకృష్ణ , శాసనసభ్యులు, వెంకటగిరి నియోజకవర్గo వారు మాట్లాడుతూ చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం,శ్రీ సిటీ, మేనకూరు సెజ్ , ఈఎంసి క్లస్టర్, తిరుపతి, మరియు చెన్నైలోని 18 బహుళ జాతీయ కంపెనీలలో 800 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపర్చుకోవాలన్నారు.
ఇందులో భాగంగా జిల్లాలోని ఐదవ తరగతి పైన పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ మెగాజాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.
రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/user-registration
రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 14-05-2025. మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదు.
ఇతర వివరములు కొరకు సంప్రదించండి:7013509543,9491458910 , 9988853335.(కాల్ సెంటర్)
గమనిక: మెగా జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో ట్రైనీ (Trainee Registration) రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెను
ఈ కార్యక్రమంలో ఆర్. లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, మాలాద్రి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, విశ్వోదయ డిగ్రీ కళాశాల, ఏ. గణేష్ జిల్లా ప్లేస్మెంట్ ఆఫీసర్,ఏపీ ఎస్ ఎస్ డి సి మరియు ఐ హరికృష్ణ ఈ ఎస్ సి కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News