Breaking News

సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ పై ముందస్తు కార్యాచరణ

-సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
-ఆపరేషన్ సింధూర్ కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం
-పరిస్థితులు అనుగుణంగా సున్నితత్వం తో వ్యవహరించాల్సి ఉంటుంది
-అసత్య ప్రచారాలు, వందతులు నమ్మవద్దు ప్రజలకి విజ్ఞప్తి
-అలార్మింగ్ హెచ్చరికలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
-రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్
-ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో గురువారం నగరంలో సమన్వయ శాఖల తో మాక్ డ్రిల్
-బుధవారం రాత్రి 8 నుంచి 8.30 వరకు పవర్ కట్
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యుద్ధ పరిస్థితులు సమయంలో తీవ్రత తగ్గించడం, నిర్వహణ విషయంలో ప్రజల్లో అవగాహన చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం “ఆపరేషన్ సింధూర్” పరిస్థితులను ఎదుర్కునేందుకు సమన్వయ శాఖల అధికారులతో కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్, జేసి, మునిసిపల్ కమిషనర్, డి ఆర్వో, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, యుద్ధ హెచ్చరికలో పౌర రక్షణలో సంభావ్య దాడులు లేదా ప్రమాదాల నుండి పౌరులను మరియు మౌలిక సదుపాయాలను రక్షించే చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వాటిపై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. జిల్లాలో గుర్తించిన స్థలాలలో, అధిక-ప్రమాదకర ప్రాంతాల నుండి ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు వ్యవస్థీకృత తరలింపు ప్రక్రియ చేపట్డం జరుగుతుందన్నారు. హెచ్చరికల మేరకు సురక్షితంగా బయటకు పడడం కోసం షెల్టర్లు మరియు బంకర్లు లో తలదాచు కోవడం ,దాడులు లేదా అత్యవసర పరిస్థితులలో ప్రజలు ఆశ్రయం పొందేందుకు సురక్షితమైన ప్రదేశాలను అనుసరించి ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. అధికారులు ఈ క్రమంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉండే విధంగా అగ్నిమాపక, వైద్య మరియు రెస్క్యూ సేవలు స్పందించడానికి సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం ముఖ్యం అన్నారు.  సమాచార వ్యవస్థ అలార్మింగ్ హెచ్చరికలు, నవీకరణలు మరియు సూచనల కోసం నమ్మకమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చెయ్యాల్సి ఉంటుందన్నారు. వివిధ కంపెనీలు, పరిశ్రమలు, తదితర ప్రాంతాల్లో ఉన్న అల్లారింగ్ , ఫైర్ అల్లారింగ్ ఇతర వ్యవస్థ లు ప్రజలను స్వచ్ఛందంగా భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరారు. ఆ క్రమంలో ప్రజా అవగాహన ఎ ప్రజా హెచ్చరికలు భద్రతా విధానాలు, తరలింపు మార్గాలు మరియు అత్యవసర ప్రోటోకాల్‌ల గురించి ఎవరికి వారు స్వీయ భద్రత కోసం చేపట్ట వలసిన వాటిపై పౌరులకు తెలియజేయడం ముఖ్యం అన్నారు. *మౌలిక సదుపాయాల రక్షణ చర్యలు లలో విద్యుత్ ప్లాంట్లు, ఆసుపత్రులు, ఆహారం నీటి శుద్ధి సౌకర్యాలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడానికి చర్యలు తీసుకోవడం. ఈ చర్యలను అమలు చేయడానికి మరియు సంభావ్య దాడుల ప్రభావాన్ని తగ్గించడానికి పౌర రక్షణ సంస్థలు తరచుగా ప్రభుత్వ సంస్థలు, అత్యవసర సేవలు మరియు సైన్యంతో కలిసి ప్రజలు పనిచేయాలని స్పష్టం చేశారు.

పౌర సమాజాన్ని అప్రమత్తం చెయ్యడంలో పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందనీ కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఈ ఘటనలను ఛాలెంజ్ గా తీసుకుని, పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చెయ్యడం జరిగిందని తెలిపారు. ప్రజల్లో ఎటువంటి ఆందోళన లేకుండా చూడాలని, వాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు సూచనలను సలహాలను ప్రజలకి అందించాలని కోరారు. యుద్ధ హెచ్చరిక సంభవించినప్పుడు, మీ స్థానం మరియు నిర్దిష్ట పరిస్థితులను బట్టి భద్రతా చర్యలు మారవచ్చునని తెలిపారు.  ప్రభుత్వం ద్వారా జారీ చేసే యుద్ధ వాతావరణ  స్థానిక వార్తలు, ప్రభుత్వ హెచ్చరికలు మరియు నవీకరణల కోసం అధికారిక ప్రకటనలను అనుసరించాల్సి ఉంటుందన్నారు. యుద్ధ హెచ్చరికల మేరకు ఒక ప్రణాళికను కలిగి ఉండడం , తరలింపు మార్గాలు మరియు సురక్షితమైన సమావేశ స్థలంతో సహా కుటుంబ అత్యవసర ప్రణాళికను అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అవసరమైన వస్తువులను నిల్వ చేసుకోవడం, ఆహారం, నీరు, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి మరియు మందులు , సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందడం, అందుకు సంబంధించిన ముందుగా ఆశ్రయాలను గుర్తించాలన్నారు. ప్రభుత్వం ద్వారా జారీ చేసిన సూచనలను అనుసరించండి,  తరలింపు ఆదేశాలు లేదా అధికారుల నుండి ఇతర ఆదేశాలకు కట్టుబడి సంఘర్షణ ప్రాంతాలను నివారించండి మరియు పేలని మందుగుండు సామగ్రి వంటి సంభావ్య ప్రమాదాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలియ చేశారు.

జిల్లా వ్యాప్తంగా వంతెనలు, పరిశ్రమలు, ఇతర ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉంటుందని, ఆయా వనరబుల్ ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడ హెచ్చరికలు చేయాలని తెలియ చేశారు. పోలీసు, ఫైర్, వైద్య ఆరోగ్య, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ , రెడ్ క్రాస్ , ఎస్ డి ఆర్ ఎఫ్ , విద్యుత్ , విద్య , తదితర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ , అదనపు ఎస్పీ సుబ్బరాజు, డి ఆర్వో టి సీతారామ మూర్తి, ఆర్డీవో రాణి సుస్మిత, ఆర్ కృష్ణ నాయక్, సిపిఓ ఎల్ . అప్పలకొండ, డిఎల్డివో పి.వీణ దేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *