Breaking News

అధిక వర్షాల నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఏడు రోజులు ఉరుములు మెరుపులు తో అధిక వర్షాల పరిస్థితులు హెచ్చరికల నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి అధికారులకు అధిక వర్షా హెచ్చరికల పరిస్థితుల దృష్ట్యా తగిన సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రానున్న వారం రోజులు ఉరుములు మెరుపులు తో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, చెట్లు, రహదారుల పై ప్రజలు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎటువంటి పశు, మానవ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించడం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *