– టీడీపీ క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు
– పాస్టర్ల గౌరవ వేతనం విడుదల చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రైస్తవుల అభివృద్ది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పాస్టర్లకు ఈస్టర్ సందర్బంగా ఏడు నెలల గౌరవ వేతనం విడుదల చేసినందకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటె స్వామిదాసు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు క్రైస్తవులకు అండగా ఉంటుందని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే క్రైస్తవులకు అభివృద్ది జరుగుతుందన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గత సంవత్సరం జూలై నుండి నవంబర్ వరకు పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనాన్ని విడుదల చేసినందకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ది కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిలో భాగంగానే క్రైస్తవులు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో అన్ని విధాలుగా క్రైస్తవులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. గౌరవం వేతనం పొందాలనుకునే పాస్టర్లకు త్వరలోనే నూతన ఎన్ రోల్ మెంట్ నోటిఫికేషన్ వస్తుందని దానికి సంబంధించి డాక్యుమెంట్ లు సిద్దం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ జిల్లా అధ్యక్షులు మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ పుష్ప రాజు, చార్లెస్,రాజ శేఖర్, నూజివీడు ప్రభాకర్, బిషప్ జీవరత్నం, పాస్టర్స్ జయరాజ్, రాజారావు, జూన్ బాబు, ఫిలిప్పీ, యేసయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News