Breaking News

నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలోని విభిన్న ప్ర‌తిభావంతులందరికీ ఉప‌కర‌ణాలు అంద‌జేస్తాము

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)
-కేంద్ర ప్ర‌భుత్వం, అలింకో సంస్థ ఆధ్వ‌ర్యంలో ఉచిత ఉప‌క‌ర‌ణాలు పంపిణీ
-ఎంపి కేశినేని చొర‌వ‌తో 193మందికి ఉప‌క‌ర‌ణాలు అంద‌జేత
-ఉప‌క‌ర‌ణాలు పంపిణీ చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్, విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌
-త‌డిచిన ధాన్యం కొనుగోలు పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కి పోన్ చేసిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్
-పీఎం న‌రేంద్ర మోదీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి వుంటాం-సైనికులు అభినంద‌న‌లు
-వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసే వారికి గ‌ట్టిగానే స‌మాధానం చెబుతా

నందిగామ‌, నేటి పత్రిక ప్రజావార్త :
గ‌త ప్ర‌భుత్వం విభిన్న ప్ర‌తిభావంతుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోలేదు. ఎన్టీఆర్ జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా విభిన్న ప్ర‌తిభావంతుల‌కు కావాల్సిన ఉప‌క‌ర‌ణాల గుర్తింపు ఎంపిక కార్య‌క్ర‌మం కేంద్ర ప్ర‌భుత్వం 2022 లోనే పూర్తి చేయ‌టం జ‌రిగింది. గ‌త మూడేళ్లుగా ఎంపిక చేసిన వారికి ఉప‌క‌ర‌ణాల పంపిణీ చేయ‌కుండా నిర్ల‌క్ష్య వైఖ‌రితో గ‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం…ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నేర‌వేర్చే విధంగా ప‌నిచేస్తుంది. ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుంటూ వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ , కేంద్ర ప్రభుత్వం, కృత్రిమ అవయవాల తయారీ సంస్థ(ALIMCO) అలింకో సంస్థ సహకారం తో విజయవాడ ఎంపి కేశినేని శివనాధ్ (చిన్ని) ఆధ్వర్యంలో నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో 193 మంది విభిన్న ప్ర‌తిభావంతుల‌కి వారికి అవ‌స‌ర‌మైన బ్యాట‌రీ ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, చంక కర్ర‌లు, చెవిటి మిష‌న్లు , చేతి కర్ర‌లు పంపిణీ కార్య‌క్ర‌మం బుధ‌వారం నందిగామ ప‌ట్ట‌ణంలోని కె.వి.ఆర్ కాలేజీలో జ‌రిగింది. . ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌, విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వాడ్రేవు కామరాజు పాల్గొన్నారు. విభిన్న ప్ర‌తిభావంతుల‌కి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య క‌లిసి ఉప‌క‌ర‌ణాలు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో 34 మందికి రూ.20,40,000 ల‌క్ష‌లు విలువ చేసే బ్యాట‌రీతో న‌డిచే మూడు చ‌క్ర‌ముల బండ్లు, 66 మందికి రూ.6,60,000 ల‌క్ష‌లు విలువ చేసే ట్రై సైకిల్స్, 13 మందికి రూ.1,09,200 లు విలువ చేసే వీల్ చైర్లు, 24 మందికి రూ.24 వేల విలువ చేసే చంక కర్ర‌లు, 29 మందికి రూ.1,85,600 లు విలువ చేసే చెవిటి మిష‌న్లు, 18 మందికి రూ.9 వేలు విలువ చేసే చేతి కర్ర‌లు మొత్తం రూ.30, 27,800 విలువ చేసే ఉప‌క‌ర‌ణాలు ఉచితంగా 193 మంది విభిన్న ప్ర‌తిభావంతుల‌కి అంద‌జేయ‌డం జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ విభ‌న్న ప్ర‌తిభావంతుల‌కు వారి అవ‌స‌రాల‌కు స‌రిప‌డా ఉప‌క‌ర‌ణాలు అందించ‌టం చాలా సంతోషంగా వుంద‌న్నారు. కేంద్రం 2022 లో విభ‌న్న ప్ర‌తిభావంతులకు ఉప‌క‌ర‌ణాలు ఉచితంగా ఇవ్వాలని జాబితా త‌యారుచేస్తే గ‌త ప్ర‌భుత్వం దీన్ని పట్టించుకున్న‌దాఖాలలు లేవన్నారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి కాగానే విజ‌య‌వాడ ఎంపిగా తాను జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా క‌లెక్ట‌ర్ , జిల్లా అధికారులతో క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేసేందుకు కృషి చేయ‌టం జ‌రిగింద‌న్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ కామరాజు స‌హ‌కారంతో ఉప‌క‌ర‌ణాలు హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కి తెప్పించ‌టం జ‌రిగిందన్నారు. అయితే విజ‌య‌వాడ‌కి వ‌ర‌ద‌లు, ద‌స‌ర ఉత్స‌వాలు, ఎమ్మెల్సీ కోడ్ కార‌ణంగా కొంత ఆల‌స్యం జ‌రిగింద‌న్నారు. రెండు నెల‌ల క్రితం విజ‌య‌వాడ లో తూర్పు, ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో 715 మంది విభిన్న ప్ర‌తిభావంతుల‌కి ఉప‌క‌ర‌ణాలు అంద‌జేయ‌టం జ‌రిగింద‌న్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోని దివ్యాంగుల‌కి కూడా ఉప‌క‌ర‌ణాలు అంద‌జేయ‌టం జ‌రుగుతుంద‌న్నారు. నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప‌క‌ర‌ణాలు అంద‌ని దివ్యాంగులు వుంటే వారికి త్వ‌ర‌లోనే అంద‌జేస్తామ‌న్నారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రాగానే విభ‌న్న ప్ర‌తిభావంతులకు చెప్పిన‌ట్లు ఆరు వేల రూపాయ‌లు పెన్ష‌న్ గా అంద‌చేస్తున్నారు.అలాగే పెన్ష‌న్ తో పాటు మీ ఆత్మ‌విశ్వాసం మ‌రింత పెరిగేందుకు అవ‌స‌ర‌మైన‌ ఉప‌క‌ర‌ణాలు అందచేస్తున్నార‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం రాజ‌కీయ నాయ‌కులు ఎక్క‌డ వుండేవారో ఎవ‌రికి తెలిసేది కాద‌ని, ప్ర‌జా ప్ర‌భుత్వంలో తామంద‌రం అధికారుల్లాగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే వుంటూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.

పీఎం న‌రేంద్ర మోదీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి వుంటాం
ప‌హ‌ల్గాం ఉగ్ర‌వాద దాడికి భార‌త సైన్యం ఆప‌రేష‌న్ సింధూర్ తో తిప్పి కొట్టింద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ప్ర‌ధాన మంత్రి నిర్ణయానికి దేశ ప్ర‌జ‌లంద‌రూ క‌ట్టుబ‌డి దేశ సైన్యం వెంటే వుంటార‌నన్నారు.
ప‌హల్గాం ఉగ్ర‌వాద దాడిలో ఎంతో మంది మ‌హిళ‌లు భ‌ర్తల‌ను కోల్పోయారు.ఈ ఉగ్ర‌వాద దాడిలో భ‌ర్త‌ల‌ను కోల్పోయిన మ‌హిళ‌ల‌తో పాటు వారి కుటుంబాల‌కు మ‌నోధైర్యం నింపేందుకు ఆప‌రేష‌న్ సింధూర్ పేరు తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావ‌రాల‌పై భార‌త్ సైన్యం చేసిన దాడులు భారతీయులంద‌రూ గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం అన్నారు. ఇలాంటి ఉగ్ర‌వాద దాడులు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా పాకిస్తాన్ కి బుద్ది చెప్పాల‌ని ప్ర‌తి భార‌తీయుడు కోరుకుంటున్నాడ‌న్నారు. ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై దాడి చేసి ఉగ్ర‌వాద‌ల‌ను హ‌త‌మ‌ర్చిన భార‌త సైనికులకు అభినంద‌న‌లు తెలిపారు.

వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసే వారికి గ‌ట్టిగానే స‌మాధానం చెబుతా
తాను ఎక్క‌డో దాక్కుని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టే ర‌కం కాదని మీడియా అడిగిన ఓ ప్ర‌శ్న‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ బ‌దులిచ్చారు. బుధ‌వారం ఉద‌యం మీడియా స‌మావేశం నిర్వ‌హించి త‌నపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు స‌రైన స‌మాధానం చెప్పాల‌నుకున్నాను..కానీ దేశంలో నెల‌కొన్న యుద్ధ వాతావ‌ర‌ణ‌ ప‌రిస్థితుల దృష్ట్యా రాజ‌కీయాలు మాట్లాడానికి స‌రైన స‌మ‌యం కాద‌ని విర‌మించుకున్న‌ట్లు తెలిపారు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత మీడియా స‌మావేశం నిర్వ‌హించి వాస్త‌వాలు తెలియ‌జేయ‌టంతో పాటుగా, త‌న‌పై బుర‌ద చ‌ల్లాల‌నుకునేవారికి గట్టిగానే స‌మాధానం చెబుతాన‌న్నారు.

అంత‌కు ముందు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ఇటువంటి బృహత్కరమైన ఈ కార్యక్రమానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ తో క‌లిసి హాజరై లబ్ధిదారులకు ఉపకరణాలు అందజేయడం సంతోషంగా వుంద‌న్నారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారులు ఉపకరణాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్నా, పార్టీల‌కు అతీతంగా అంద‌జేయ‌టం జ‌రుగుతుంద‌న్నారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ అలింకో (ఆర్టిఫిషల్ లింబ్ కార్పొరేషన్) సంస్థ వారితో చర్చలు జరిపి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన‌ ఉప‌క‌ర‌ణాలు తీసుకువ‌చ్చేందుకు ఎంతో కృషి చేశారంటూ వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ప‌దివేల ట‌న్నుల బియ్యం కొనుగోలుకు ఎంపి చొర‌వ‌
గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాల కార‌ణంగా నందిగామ నియోజకవర్గంలో వరి రబీ పంట బాగా దెబ్బతిన్న విష‌యం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌తో క‌లిసి రైతులు ఎంపి కేశినేని శివ‌నాథ్ దృష్టికి తీసుకురావ‌టం జ‌రిగింది. త‌క్ష‌ణం ఎంపి కేశినేని శివ‌నాథ్ క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తో పోన్ మాట్లాడి రైతుల‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ప‌ది వేల ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒప్పించారు. రైతుల ప‌క్ష‌పాతి అని నిరూపించుకున్న ఎంపి కేశినేని శివ‌నాథ్ కి నియోజకవర్గ రైతాంగ సోదరుల తరఫున ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ చైర్ పర్స‌న్ మండ‌వ కృష్ణ కుమారి, ఎన్.ఎస్.పి కెనాల్ ఎడ‌మ కాలువ ఛైర్మ‌న్ కోట వీర‌బాబు, కంచిక‌చ‌ర్ల ఎ.ఎమ్.సి చైర్మ‌న్ కోగంటి బాబు, రాష్ట్ర బిసి సెల్ అధికార ప్ర‌తినిధి య‌న‌గాల నూకాల‌మ్మ‌, జ‌న‌సేన నియోజ‌క‌వర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త తంబ‌ళ్ల‌ప‌ల్లి ర‌మాదేవి, నందిగామ మండ‌ల‌పార్టీ అధ్య‌క్షుడు వీరంకి వీరాస్వామి, చంద‌ర్ల‌పాడు మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు మేక‌ల సుధాక‌ర్, నందిగామ టౌన్ పార్టీ అధ్య‌క్షుడు ఏల్చూరి రాము, మైనార్టీ నాయ‌కుడు అల్లి పాషా, విజ‌య మిల్క్ యూనియ‌న్ డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రావు ల‌తో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *