Breaking News

ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిఫెన్స్, స్పేస్ సలహాదారుల సమావేశం

-ఆంధ్రప్రదేశ్‌ను దేశీయ రక్షణ, అంతరిక్ష రంగాల్లో ముందడుగు వేయించేందుకు తొలి అడుగు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
డిఫెన్స్ మరియు స్పేస్ రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో, మాజీ డిఆర్డిఓ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర డిఫెన్స్, ఏరోస్పేస్ హబ్ సలహాదారు డా. జి. సతీష్ రెడ్డి ముఖ్యమంత్రి ని కలవడం, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా, రాబోయే డిఫెన్స్-ఏరోస్పేస్ పాలసీ రూపకల్పనలో తమ అనుభవాన్ని పంచుతూ, దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా అత్యుత్తమ విధానాన్ని రూపొందించాలని డా. సతీష్ రెడ్డి అనేక విలువైన సూచనలు చేశారు. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో డిఫెన్స్, ఏరోస్పేస్ హబ్‌లు ఏర్పాటయ్యే దిశగా చర్చలు సాగాయి. ప్రజెంటేషన్ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డా. సతీష్ రెడ్డిని శాలువా కప్పి, సత్కరించి, రక్షణ రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గౌరవం తెలిపారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ మాట్లాడుతూ, “ఇది ఉద్యోగ అవకాశాల కల్పనకు, దేశ రక్షణ రంగ అభివృద్ధికి కీలక మలుపు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో శక్తివంతమైన రక్షణ రంగ పునాదులు వేసుకుంటోంది,” అని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *