-తిరువూరు గుడిమెట్ల వీరభద్రరావుకి రూ.2 లక్షల ఎల్.వో.సి మంజూరు
-బాధితుడి కుమారుడికి రూ.లక్షల ఎల్.వో.సి అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తక్షణం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్(సీఎం రిలీ ఫ్ ఫండ్) చేయూతగా నిలుస్తుందని విజయవా ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి ) పత్రాన్ని ఎంపి కేశినేని శివనాథ్ బాధితుడు కుమారుడు గుడిమెట్ల రామారావుకి అందజేశారు. తిరువూరుకి చెందిన గుడిమెట్ల వీరభద్రరావు గుండె సంబంధిత సమస్యకి శస్త్రచికిత్స , డయాలసిస్ వైద్య చికిత్స నిమిత్తం తక్షణ ఆర్థిక సాయంకై లెటర్ ఆఫ్ క్రెడిట్ కోసం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సాయంతో ఆర్టీ పెట్టుకున్నారు. ఎల్.వో.సి పత్రాన్ని అందుకున్న గుడిమెట్ల రామారావు ఎంపి కేశినేని శివనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ హుస్సెన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మాదల హరిచరణ్ (కిట్టు), తిరువూరు పట్టణ 15వ వార్డ్ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు, తిరువూరు తెలుగు యువత ఉపాధ్యక్షుడు షేక్ హుస్సెన్, తెలుగు దేశం నాయకులు వేముల చక్రవర్తి, పర్వతం శ్రీనివాసరావు, మోదుగు వెంకటేశ్వరరావు, గుంజా రాంబాబు, సజ్జారవి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News