Breaking News

జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంపు కు కృషి చేస్తా

-ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ఆలపాటి సురేష్‌

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తానని సి. రాఘవాచారి ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులైన ఆలపాటి సురేష్‌ చెప్పారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే.మంగళవారం ఉదయం ఆయన గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌ని సందర్శించిన నేపధ్యంలో ఎపియూడబ్ల్యూజె, ప్రెస్‌క్లబ్‌, సామ్నా నాయకులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన జర్నలిస్టుల ఇష్టాగోష్టిలో ఆలపాటి సురేష్‌ మాట్లాడుతూ ప్రస్తుతం అనేక మంది కొత్తగా జర్నలిజమ్‌లోకి వస్తున్నారని,
అటువంటి వారందరికి అకాడమీ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం చేస్తామని చెప్పారు. ఎపియూడబ్ల్యూజె నేతలు మాట్లాడుతూ జర్నలిస్టులకు వృత్తిపరమైన నైపుణ్యం పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. వర్కింగ్‌ జర్నలిస్ట్‌గా ఉన్న వ్యక్తిని ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియమించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సి. రాఘవాచారి ప్రెస్‌ అకాడమీకి గవర్నింగ్‌ కౌన్సిల్‌ని ఏర్పాటు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎపియూడబ్ల్యూజె అర్బన్‌ యూనిట్‌ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన ఇష్టాగోష్టి కార్యక్రమంలో ఐజెయు కౌన్సిల్‌ సభ్యుడు ఎస్‌కె బాబు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కె.జయరాజ్‌, డి.నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.రమణారెడ్డి, అర్బన్‌ యూనిట్‌ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, సామ్నా నగర అధ్యక్షుడు ఎంవి సుబ్బారావు, యూనియన్‌ నాయకులు జి.రఘురామ్‌, శివరామకృష్ణ, అహ్మద్‌ హుస్సేన్‌, కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *