Breaking News

డ్రైన్లో త్రాగునీటి పైప్లైన్లు ఉండరాదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు త్రాగునీటి సరఫరా చేసే విషయంలో అశ్రద్ధ వహించరాదని, ప్రత్యేకంగా డ్రైన్లలో త్రాగునీటి పైప్లైన్లు ఉండరాదని  విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర  ఆదేశించారు.  మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 30 డివిజన్ దేవీనగర్, జివిఆర్ నగర్ పరిసర ప్రాంతాలని  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైన్లో త్రాగునీటి పైప్లైన్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పైప్లైన్లు విడిగా పెట్టి త్రాగునీటి సరఫరా లో డ్రైన్లో కలవకుండా చూసుకునేటట్టు అధికారుల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎమినిటీ సెక్రటరీలు ప్రతిరోజు త్రాగునీటి శుద్ధత పరీక్షలు చేయడమే కాకుండా వారి వారి వార్డులలో పర్యటించి డ్రైన్లలో ఎటువంటి త్రాగునీటి పైప్లైన్ కలవకుండా చూసుకోవాలని, వారు అధికారులకు ప్రతిరోజు నివేదికను సమర్పించాలని అధికారులు ఎప్పటికప్పుడు నివేదికను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆ వార్డ్ లో ఉన్న సమస్యలన్నీ క్షేత్రస్థాయిలో తెలిసేందుకు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ద్విచక్రవారంపై వార్డు మొత్తం పర్యటించి, ఆ వార్డులో గల పారిశుద్ధ్య  నిర్వహణ, కన్స్ట్రక్షన్ అంటే డెమోలిషన్  వ్యర్ధాల సమస్యలను  పరిశీలించి  వెంటనే చర్యలు తీసుకోవాలని, అధికారులతో ఆదేశించారు. జివిఆర్ నగర్లో నిర్మాణం జరుగుతున్న ఎలివేటెడ్ సర్వీస్ లెవెల్ రిజర్వాయర్ మరియు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *