-స్విమ్మర్ లను అభినందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖేలో ఇండియా 2025 యూత్ గేమ్స్ అండర్-18 కేటగిరీలో ఆల్ ఇండియా ఛాంపియన్షిప్లో 64 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తృతీయ స్థానంలో నిలిచింది. ఈ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన అండర్-18 స్విమ్మర్లు తీర్థు సామదేవ్, దేవ గణేష్, యజ్ఞ సాయి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ధ్యానచంద్రును కలిశారు. కమిషనర్ స్విమ్మర్లను అభినందిస్తూ, వారు రాష్ట్రానికి గర్వకారణమని ప్రశంసించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్విమ్మింగ్లో సాధించిన ఘనత రాష్ట్రం గర్వించదగ్గ విషయం అని, వారి ప్రతిభకు విజయవాడ నగరపాలక సంస్థ తరఫున మద్దతు ఉండే విధంగా అన్ని విధాలా సహకరిస్తారని, భవిష్యత్తులో వారు మరింత ప్రగతి సాధించాలని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అఫ్ స్పోర్ట్స్ డాక్టర్ లత, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఐ. రమేష్, కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ వి. వినోద్, సహాయక కోచ్ నితీష్, ఇతర కోచ్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News