Breaking News

సైనికుల సంక్పలానికి దైవ బలం తోడుండాలి

-ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రమూకల ఆట కట్టించాం
-సరిహద్దుల్లో సైనికుల పోరాటం స్ఫూర్తివంతం
-జాతీయతను పెంపొందించే విషయంలో జనసేన పార్టీ ముందుంటుంది
-విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘దేశ ప్రజలంతా భారత సైన్య పరాక్రమాన్ని చూశారు. అమాయకులైన 26 మంది పర్యాటకుల్ని పెహల్గాంలో పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకల్ని తుద ముట్టించడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ ద్వారా శత్రువును బలమైన దెబ్బ కొట్టాం. ఈ కీలక సమయంలో దేశ ప్రజల ఐక్యత మరోసారి నిరూపితమైంద’ని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సైన్యానికి దేశ ప్రజలందరి మద్దతుతోపాటు, దైవ బలం మెండుగా ఉండాలని ప్రార్ధిస్తూ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో మంత్రి మనోహర్ తో పాటు శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, జనసేన నాయకులు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి వేదపండితులు ఆశీర్వచనం చేశారు.
అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ
‘‘అమ్మవారి ఆశీస్సులు మన దేశ సైనికులకు తోడుగా ఉండాలని దుర్గమ్మకు పూజలు చేశాం. దేశ ప్రజల మనోబలంతో భారత సైనికులు ప్రతి అడుగు ముందుకు వేస్తూ ముష్కరులను తుద ముట్టించేలా చూడాలని ప్రార్థించాం. వర్తమాన రాజకీయాల్లో దేశం కోసం అందరిలో స్ఫూర్తి నింపుతూ, జాతీయతా భావాన్ని యువతలో తీసుకొచ్చేలా జనసేన పని చేస్తుంది. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలనుసారం జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, వీర మహిళలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పూజలు చేస్తున్నారు. సైనికుల సంకల్ప బలానికి దైవ బలం తోడుగా ఉండాలని అన్ని చోట్లా పార్టీ శ్రేణులు పూజల్లో పాల్గొంటున్నారు.
అమాయకులైన పర్యాటకులను ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా పాకిస్థాన్ ఉల్లంఘించి మళ్లీ కాల్పులకు తెగబడటం ఆ దేశ నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది. మన భారత సైన్యం ఎలాంటి దాడిని అయినా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. పాకిస్థాన్ చర్యల వల్ల మరోసారి సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కీలకమైన సమయంలో దుర్గమ్మ అనుగ్రహం మన సైనికులకు ఉండాలని వేడుకున్నాం.
గత ఏడాది ఎన్నికలు ఇదే సమయానికి జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ది, సంక్షేమం కోసం కూటమి నేతలంతా కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నాం.
రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పని చేసేలా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటాం. ఆలయాలతో పాటు చర్చిలు, మసీదుల్లో కూడా సైనికులకు అండగా ఉండేలా జనసేన నాయకులు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు’’ అన్నారు.
• మన సైనికుల పోరాటం స్ఫూర్తిదాయకం : పిడుగు హరిప్రసాద్, శాసనమండలిలో ప్రభుత్వ విప్
ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ… ‘‘సరిహద్దుల్లో మన దేశ సైనికులు చూపుతున్న పోరాటం అసమానం. వారి నిరంతర అప్రమత్తత కారణంగానే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అలాంటి సైనికుల పరాక్రమానికి దైవబలం తోడుగా ఉండాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించాం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సైతం జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశం బాగు కోసం మన సైన్యం సంకల్ప బలానికి తోడు దైవ బలం కూడా ఉంటే వారికి మరింత మనోస్థైర్యం లభి మీస్తుంది. జనసేన పార్టీ ఎల్లపుడూ జాతీయ భావాన్ని పెంపొందించేలా ముందుకువెళ్తుంది. దేశ భక్తిని యువతలో నింపడానికి పవన్ కళ్యాణ్ నిత్యం తపిస్తారు. ఆయన బాటలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్తాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, పార్టీ నేతలు అక్కల గాంధీ, శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, పోతిరెడ్డి అనిత, బొలియాశెట్టి శ్రీకాంత్, బొలిశెట్టి వంశీకృష్ణ, బాడిత శంకర్, తిరుపతి అనూష, కె.ఎస్.ఎన్.మూర్తి, ఠాకూర్ అజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *