Breaking News

నృత్య క‌ళాకారిణి ప్ర‌ణితా రెడ్డి కి ఎంపి కేశినేని శివనాథ్ అభినంద‌న

-గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ లో స్థానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవ‌ల హైద‌రాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో క‌ళా వైభ‌వం పేరిట 4వేల 300 మంది నృత్య క‌ళాకారిణుల‌తో ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య‌ప్ర‌ద‌ర్శ‌న లో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్న నృత్య‌క‌ళాకారిణి ప్ర‌ణీతారెడ్డి (14) ను ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అభినందించారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ తెలుగు యువ‌త అధ్యక్షుడు ఆర్.మాధ‌వ ఆధ్వ‌ర్యంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ మంగ‌ళ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వన్ మ‌ర్యాద‌పూర్వ‌కం క‌లిశారు. ప్ర‌ణితారెడ్డి త‌ను గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ నుంచి అందుకున్న‌ మెడల్‌, ప్రశంసాపత్రాన్ని ఎంపి కేశినేని శివ‌నాథ్ కి చూపించింది. ప్ర‌ణీతారెడ్డి అభిరుచి గ‌మ‌నించి కూచిపూడి నేర్పించిన ప్ర‌ణీత రెడ్డి తల్లిదండ్ర‌లు దాస‌రి శివాజీ రెడ్డి, నాగ‌మ‌ణిల‌ను ఎంపి కేశినేని శివ‌నాథ్ ప్ర‌త్యేకంగా అభినందించారు. ఇంత చిన్న వ‌యస్సులోనే 1000 పైగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌టం ప్ర‌ణీతా రెడ్డికి నృత్యంపై వున్న ఆస‌క్తి తెలియ‌ప‌రుస్తుంద‌న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *