Breaking News

ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డటంలో, రుణాలు ఎగ్గొట్ట‌డంలో కేశినేని నాని ఘ‌న‌పాఠి

-కేశినేని నాని ఆర్థిక నేరాల‌పై విచార‌ణ కోరుతూ సిబిఐ కి లేఖ రాసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస‌రావు
-వైసీపీ జెండాతో నాని అజెండా
-రాజ‌కీయ కుట్ర‌లో భాగంగానే ఎంపి కేశినేని శివ‌నాథ్ పై బుర‌ద జ‌ల్లే కార్య‌క్ర‌మం
-షెల్ కంపెనీ లతో ఆదాయాన్ని మళ్లిస్తున్న నాని*
-లిక్క‌ర్ స్కామ్ పై జ‌రిగే సిట్ విచార‌ణ నుంచి ప్ర‌జ‌ల‌ దృష్టి మ‌ళ్లించేందుకు ఆరోప‌ణ‌లు
-గ‌త ప‌దేళ్లుగా ఎంపి ప‌ద‌విని దుర్వినియోగం చేసిన కేశినేని నాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ఎంపిగా కేశినేని శ్రీనివాస్ (నాని) గ‌త పదేళ్లుగా త‌న ప‌ద‌విని అడ్డుపెట్టుకుని వివిధ కంపెనీల పేర్ల‌తో బ్యాంకుల్ని మోసం చేశాడు. కేశినేని నాని చేసిన ఆర్థిక నేరాల‌పై పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ సిబిఐ డైరెక్ట‌ర్ కి తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు లేఖ రాశారు. ప‌దేళ్లు ఎంపిగా వున్న నాని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ది చేశాడో, ఎంపి గా ఈ ప‌ద‌కొండు నెల‌ల కాలంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చేసిన అభివృద్ది పై ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రావాల‌ని ఎమ్మెల్యే కొలిక‌పూడి స‌వాల్ విసిరారు.

మాజీ ఎంపి కేశినేని నాని గ‌త ప‌దేళ్లుగా త‌న ప‌ద‌విని అడ్డుపెట్టుకుని పాల్ప‌డిన ఆర్థిక నేరాలను వివ‌రించేందుకు, ఎంపి కేశినేని శివ‌నాథ్ పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు మంగ‌ళ‌వారం గురునానక్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మావేశంలో కొలిక‌పూడి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ వైసిపి జెండాను భుజాన‌ మోస్తూ, తాడేపల్లి స్క్రిప్ట్ నే అజెండాగా చేసుకుని మాజీ ఎంపీ కేశినేని నాని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. త‌న రాజకీయ పలుకుబడితో బ్యాంకులను బురిడీ కొట్టించిన‌ నాని తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తెల్చి చెప్పారు.

జ‌గ‌న్ రెడ్డి అండ్ టీమ్ ఐదేళ్లు చేసిన లిక్క‌ర్ స్కామ్ గురించి సిట్ జ‌రుపుతున్న‌ విచార‌ణ నుంచి ప్ర‌జ‌ల‌ దృష్టిని మ‌ల్లించే కార్య‌క్ర‌మంలో భాగంగానే నాని మాట్లాడార‌నేది స్ప‌ష్టం అర్ధ‌మ‌వుతుందన్నారు. నాని గ‌త ప‌దేళ్లుగా లోక్ స‌భ స‌భ్యుడిగా చేసిన అక్ర‌మ వ్యాపారాలు , ఆర్థిక నేరాల‌కు సంబంధించిన డ్యాకుమెంట్స్ తో స‌హా పూర్తి సాక్ష్యాలు తన‌ ద‌గ్గ‌ర వున్నాయ‌న్నారు.

కేశినేని నాని ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డటంలో,బ్యాంకుల నుంచి తీసుకున్న‌ రుణాలు ఎగ్గొట్ట‌డంలో ఘ‌నాపాఠి అన్నారు. కేశినేని నాని మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా వున్న కేశినేని హోట‌ల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆంధ్ర ల‌యోలా కాలేజీ లోని ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ నుంచి కోట్లాది రూపాయ‌లు రుణం తీసుకున్నాడు. వ్యాపారం మంచి లాభాలో విజ‌య‌వంతంగా న‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాంక్ ఒక రూపాయి కూడా తిరిగి చెల్లించ‌కుండా కేశినేని నాని ఆర్థిక నేరానికి పాల్ప‌డ్డాడన్నారు.

కేశినేని హోరేకా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరు పై రుణం తీసుకుని ఆ కంపెనీ లాభాల్లో న‌డుస్తుండ‌గా, బ్యాంక్ కి తెలియ‌కుండా ఆ బ్యాంక్ ను మోసం చేసిన ఘ‌నుడు కేశినేని నాని అంటూ మండిప‌డ్డారు. ఆ కంపెనీ నుండి డైరెక్ట‌ర్లు గా కేశినేని నాని, కేశినేని నాని భార్య త‌ప్పుకుని వారి ద‌గ్గర ప‌నిచేసే తాతినేని రాంబాబు, కాట్ర‌గ‌డ్డ హేమంత్ ను ఇద్ద‌ర్ని డైరెక్ట‌ర్లు గా పెట్టి ఈ మొత్తం ఈ వ్య‌వ‌హారం బ్యాంక్ కి తెలియ‌కుండానే బ్యాంక్ ను మోసం చేశాడ‌న్నారు.

కేశినేని నాని మంచి ఆదాయం వ‌స్తున్న హోట‌ల్ బిజినెస్ లో ఆ ఆదాయాన్ని బ్యాంక్ రుణం తీర్చ‌టానికి ఉప‌యోగించ‌కుండా ఆంధ్రా క్యాంటీన్ అనే సూట్ కేస్ కంపెనీ పెట్టి ఆ ఆదాయాన్ని అటు మ‌ళ్లించ‌టం జ‌రిగింద‌న్నారు. కేశినేని హోరేకా ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్ట‌ర్లు తాతినేని రాంబాబు, కాట్ర‌గ‌డ్డ హేమంత్ ల‌ను డైరెక్ట‌ర్లు గాపెడితే ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ కి త‌న కూతుళ్లు ఇద్ద‌ర్ని డైరెక్ట‌ర్ల‌గా పెట్టాడన్నారు.

కేశినేని నాని ఇండియ‌న్ ఓవ‌రీస్ బ్యాంకులో ఏ ఆస్తులు తాక‌ట్టు పెట్టి రుణం తీసుకున్నాడో… .అవి ఆయ‌న రుణం చెల్లించ‌క‌పోటం వ‌ల్ల ఎన్.పిఎ మారిన త‌ర్వాత‌..ఇంకో ధ‌ర్డ్ పార్టీకి అవే ద‌స్తావేజులు తాకట్టు పెట్టి ఇంకో ఆర్థిక నేరానికి నాని పాల్ప‌డ్డార‌న్నారు. గ‌త ప‌ది సంవ‌త్స‌రాలు ఎంపి గా వున్న‌ కేశినేని నాని త‌న‌కున్న ప‌ద‌విని అడ్డుపెట్టుకుని త‌న అవినీతి మీద‌, త‌న ఆర్ధిక నేరాల‌మీద బ్యాంకుల‌కి వివిధ ఆర్ధిక సంస్థ‌ల‌కు ఎగ్గొట్టిన పెద్ద మొత్తం కొట్లాది రూపాయ‌ల‌కు సంబంధించి ఏ సంస్థ ఎలాంటి విచార‌ణ చేయ‌కుండా అధికార ద‌ర్వినియోగం చేశాడ‌న్నారు.

త‌న ఫిర్యాదును స్వీక‌రించి సిబిఐ రాజ‌కీయాల‌కు అతీతంగా, నిష్ప‌క్ష‌పాతంగా కేశినేని నాని ఆర్థిక నేరాల‌పై …పూర్తి స్థాయి విచార‌ణ చేయాల‌ని సిబిఐ డైరెక్ట‌ర్ ను కోరారు.

అభివృద్దిపై చ‌ర్చ‌కు సిద్ద‌మా? నానికి ఎమ్మెల్యే కొలిక‌పూడి స‌వాల్

కేశినేని నాని ఎంపిగా వున్న ప‌దేళ్ల కాలంలో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ది జ‌రిగింది. ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ఈ ప‌ద‌కొండు నెల‌ల కాలంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ పార్లమెంట్ నియోజ‌వ‌క‌ర్గ ప‌రిధిలో ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాడ‌నే అంశం పై చ‌ర్చ‌కు రావాల‌ని నానికి స‌వాల్ విసిరారు. వ‌రదల స‌మయంలో కేశినేని నాని ఎక్క‌డ వున్నాడంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ప‌ది సంవ‌త్స‌రాల కాలంలో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఎన్ని సార్లు ప‌ర్య‌టించారో చెప్పాల‌న్నారు. కేశినేని నాని ఒక విఐపి లాగా ఢిల్లీ నుంచి విజ‌య‌వాడకి తిరిగితే…
గ‌త ప‌ద‌కొండు నెలల్లో కేశినేని శివనాథ్ తిరువూరు లాంటి వెన‌క‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎ.కొండూరు తండాల్లో తిరిగారు. మైలవ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జి.కొండూరు తండాల్లో తిరుగుతున్నారు. నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గాలో వేలాదిమంది యువ‌త‌ను స‌మీక‌రించి హైర‌దాబాద్ లో ఎన్.ఐ.ఆర్.డి ఉపాధి క‌ల్ప‌న‌కు శిక్ష‌ణ ఇప్పించి మొత్తం విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌టానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వివ‌రించారు.

కేవ‌లం జ‌గ‌న్ రెడ్డి అండ్ టీమ్ ను కాపాడే ఎజెండాతో , లిక్క‌ర్ స్కామ్ విచార‌ణ ప్ర‌జ‌ల నుంచి డైవ‌ర్ట్ చేసేందుకు ఎంపి కేశినేని చిన్ని పై బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తే…నాని నైతికంగా ఇబ్బందులు ఎద‌ర్కొంటార‌ని తెలిపారు. ఎంపి కేశినేని చిన్ని పై నాని ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడు ఎంపి కేశినేని చిన్ని స్పందించాల్సిన అవ‌స‌రం లేదని. విజ‌య‌వాడ లోక్ స‌భ ప‌రిధిలో టీమ్ ఎన్టీఆర్ జిల్లాలో ఏడుగురు శాస‌న‌సభ్యులు వున్నార‌ని తెలిపారు. ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అభివృద్ది కోసం ఒక య‌జ్ఞం చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఎన్డీయే కూట‌మి ఏర్ప‌డిన త‌ర్వాత ఐదారు నెల‌లు గ‌త ప్ర‌భుత్వం చేసిన విధ్వంసం నుంచి సాధార‌ణ ప‌రిపాల‌న ప్రారంభించ‌టానికే స‌రిపోయిందన్నారు. ఇప్పుడు 2025-26 బ‌డ్జెట్ త‌ర్వాత ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఇండస్ట్రీయ‌ల్ పార్క్ ఏర్పాటు చేసే ల‌క్ష్యంతో మందుకు వెళుతున్నాట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *