-ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలను కల్పించాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పురోగతిలో ఉన్న పలు అబివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, పంచాయతీరాజ్, డ్వామా, ఎంపిడిఒలు, సంబందిత అధికారులతో పల్లె పండుగలో భాగంగా మంజూరైన సిసి రోడ్లు పనుల పురోగతి పై వర్చువల్ గా జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఫారం పాండ్లు నిర్మాణం, పండ్లు పూల తోటల పెంపకం, పొలాలకు ఇరువైపులచెట్లు నాటించడం, ప్రభుత్వ కార్యాలయాలు ఆవరణలో చెట్లు నాటించే పనులు, సీసీ రోడ్లు నిర్మాణం వంటి పనులలో పురోగతి చూపాలని, ఎటువంటి అలసత్వం వహించరాదని తెలిపారు. నరేగా కింద కూలీల వేతనాలను 300 రూపాయలకు తగ్గకుండా చూడాలని తెలిపారు. లక్ష్యం మేరకు పనులను త్వరితగతిన వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తి చేయాలని అన్నారు. పలు మండలాలు లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయని పురోగతి చూపించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, డ్వామా అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని తెలిపారు.
Prajavartha Online Telugu News