Breaking News

వ్యక్తిగత మరియు సాముహిక మరుగుదొడ్ల పనులను వేగవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పంచాయతీల వారీగా త్రాగునీటి వనరులు (JJM), జిల్లా పరిషత్, MPLADS, వ్యక్తిగత మరియు సాముహిక మరుగుదొడ్ల పనులను వేగవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు త్రాగునీటి వనరులు (JJM) జిల్లా పరిషత్,MPLANDS వ్యక్తిగత మరియు సామూహిక మరుగుదొడ్ల పనులపై మండలాల వారిగా జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్ కార్యక్రమము నందు 1,258 పనులకు గాను 1,230 పనులు పూర్తి చేయడం జరిగినది. మిగిలిన 28 పనులు 28.20 కోట్ల రూపాయలతో జూన్ నెల ఆఖరిలోపు పుర్తిచేయవలసినదిగా ఆదేశించారు. MPLADS మరియు జిల్లా పరిషత్ పనులు నిర్మాణం చేపట్టడంలోగల ఇబ్బందులను డిపార్ట్మెంటు అమలు విధానంలో చేయవలసినదిగా తెలిపారు. అంగన్వాడి విద్యాకేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం మరియు పైకప్పు నీటి సంరక్షణ నిర్మాణాల పనులు పూర్తి చేయాలని అన్నారు. 948 వ్యక్తిగత మరుగుదొడ్లు మే ఆఖరు లోపు పూర్తి చేయవలసినదిగా ఆదేశించారు. గ్రామాలలో తాగునీటి ఇబ్బందులు లేకుండా పనులన్ని౦టిని యుద్ద ప్రాతిపదికన చేయవలసినదిగా గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించడమైనది.

ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ యస్ పర్యవేక్షిక ఇంజనీరు కె. విజయ కుమార్, డిఈఈలు, ఇతర సంబంధిత అధికారు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *