తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణ ప్రాంతాలలో గల పేద మహిళల ఆర్థిక సాధికారికత లక్ష్యంగా.. స్వయం సహాయక సంఘాల సభ్యులకు SHG రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు ముద్ర, స్టాండప్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలను అందించి వారి ఆర్థిక స్థితిని మెరుగు పరచవచ్చని అందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు అందించే బ్యాంకు లింకేజీ, తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్ మౌర్య, మెప్మా పీడీ రవీంద్ర, ఎల్ డి ఎం. విశ్వనాథరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు తో కలసి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… స్వయం సహాయక సంఘాలలోని మహిళలు మెప్మా ద్వారా ఆర్థిక సహాయంతో పాటు వారికి ఉన్నటువంటి యూనిట్ల ద్వారా అభివృద్ధి చెందడంతో పాటు నూతన యూనిట్ల ను ఏర్పాటు చేయాలని తెలిపారు. రాపిడ్ వెహికల్స్, తృప్తి క్యాంటీన్, టూరిజం సర్వీసెస్, అమృతమిత్ర వంటి స్పెషల్ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ఎక్కువ మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకు సంబంధించిన లక్ష్యాలతో పాటు పూర్తిచేయాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉపాధి కల్పించడం వలన ఆర్థిక అభివృద్ధి తో పాటు మహిళా సాధికారత సాధించేలా కృషి చేయాలన్నారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలచే పెట్రోల్ బంకు నిర్వహణకు సంబంధించిన స్థల సేకరణ చేపట్టి పెట్రోల్ బంకు ఏర్పాటు కు సంబంధించిన పనులు ప్రారంభించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెప్మా పిడి రవీంద్ర, ఎల్ డి ఎం విశ్వనాథ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సుధాకర్ రావు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య ఇతర మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News