Breaking News

శిక్షణ పొందిన యువతకు బ్యాడ్జెస్ మరియు సర్టిఫికెట్స్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు ఏ పి యస్ యస్ డి సి కోఆర్డినేటర్స్ కి డిజిటల్ భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి NASSCOM ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్‌తో కలిసి అద్భుతమైన కార్యక్రమాలను Dr.S. వెంకటేశ్వర్, ఐఏఎస్, కలెక్టర్ తిరుపతి జిల్లా శిక్షణ పొందిన యువతకు బ్యాడ్జెస్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగినది

ఏపీ ఎస్ ఎస్ డి సి, వారి ఆధ్వర్యంలో, Dr.యస్ వెంకటేశ్వర్, ఐఏఎస్, కలెక్టర్, తిరుపతి జిల్లా మరియు Dr.ఐ వి సుబ్బారావు, ఐ. ఏ. యస్ (Rtd), నీతి అయోగ్ గౌరవ సలహాదారు ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, అధ్యక్షతన 30 మంది విద్యార్థులకు NASSCOM అంబసిడార్ బ్యాడ్జెస్ ప్రదానం చేయటం జరిగింది.

ఈ ప్రోగ్రామ్ లో తిరుపతి జిల్లా డిగ్రీ కాలేజీ, వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థిని, విద్యార్థులు మరియు ఏ పి యస్ యస్ డి సి కోఆర్డినేటర్స్ Nasscom -అకాడెమియా అనుసంధానం, ఫీచర్ స్కిల్స్ ప్రోగ్రామ్‌లు, మరియు రాబోయే మూడేళ్ల మాన్పవర్ అవసరాలు వంటి ముఖ్యాంశాలపై చర్చించడం జరిగినది.

ఈ ప్రోగ్రామ్ లో ప్రధానంగా:
✔ ఏ పి యస్ యస్ డి సి మరియు NASSCOM ఫీచర్ స్కిల్స్ ఆన్లైన్ ఏ ఐ కోర్సెస్ అవకాశాలు – విద్యార్థులకు అనుభవాన్ని అందించడానికి మార్గదర్శకత్వం.
✔ రాబోయే 3 సంవత్సరాల మాన్పవర్ అవసరాలు – కంపెనీలు భవిష్యత్తులో ఏ విధమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను కోరుకుంటున్నాయో వివరించడం.
✔ ఉద్యోగ అవకాశాలు & పరిశ్రమ అవసరాలు – యువతకు వృత్తిపరమైన అవకాశాలను వివరించడం జరిగింది.

ఈ NASSCOM ఫీచర్ స్కిల్స్ ద్వారా విద్యార్థులు ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ అవసరాలను అర్థం చేసుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరచడానికి, మరియు సంస్థలతో నేరుగా అనుసంధానమవడానికి అవకాశం లభించనుంది.

ఈ కార్యక్రమంలో Dr. యస్. వెంకటేశ్వర్, ఐఏఎస్, కలెక్టర్, తిరుపతి జిల్లా మాట్లాడుతూ జిల్లాలోని డిగ్రీ , ఇంజనీరింగ్ మరియు యూనివర్సిటీ కళాశాలలో జిల్లాలోని ఏ పి యస్ యస్ డి సి ద్వార NASSCOM ఫీచర్ స్కిల్ల్స్ ప్రణాళికలను రూపొందించి పరిశ్రమలు శాఖల వారితో సమన్వయం చేసుకుంటూ యువతకు ఉపాధి అవకాశాల కొరకు అన్ని విధాలాగా సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. అలాగే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ వివిధ సాంకేతిక సంస్థలు అన్ని కలుపుకొని స్కిల్ గ్యాప్ అనాల్సిస్ సర్వే పూర్తి చేసిన తర్వాత మరొక కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి అందరికీ ఉపయోగకరంగా ఇండస్ట్రీ వారికి, అలాగే అకాడమిక్ వారికి, నిరుద్యోగ యువతకి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మన జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమల్లో కల్పించడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఐ.వి. సుబ్బారావు, ఐ ఏ యస్ (Rtd) వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థలలో NASSCOM ఫీచర్ స్కిల్ల్స్ అనుసంధానం కొరకు అన్ని విధాలుగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో విద్యార్థులు ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ వంటి కోర్సెస్ చేయటం వాళ్ళ ఉపాది అవకాశాలు ఎక్కువగా వస్తాయి అని అన్నారు.
అలాగే పరిశ్రమలకు కావాల్సినటువంటి స్కిల్ మాన్ పవర్ ను విద్యాసంస్థల లోనే అకాడమిక్ టైమ్ పీరియడ్ లోనే సిద్ధం చేసుకోవడం కోసం చాలా అత్యవసరమని అందుకు తగినటువంటి సూచనలు సలహాలను ఏపీ ఎస్ ఎస్ డి సి ద్వారా అకాడమిక్ విద్యార్థులకి అందిచటం చాలా శుభప్రదమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉదయ శంకర్, NASSCOM డైరెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ తో ఫీచర్ స్కిల్ల్స్ సంబందిచి బ్యాడ్జెస్ విద్యార్థులకి ఇవ్వటం చాల సంతోషంగా ఉంది అన్నారు. అలాగే NASSCOM వారు ఏపీ ఎస్ఎస్డిసి వారి అద్వర్యం లో ఒప్పందం చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఈ NASSCOM ఫీచర్ స్కిల్ల్స్ డిగ్రీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకి ఆర్టిఫిసియల్ ఇంటేలిగేన్స్ వంటి కోర్సెస్ ఉచితంగా శిక్షణ తెసుకుని సర్టిఫికేట్ కూడా పొందుతారు. అలాగే సర్టిఫికేట్ కంప్లీట్ చేసిన వారికీ ఉపాధి అవకాశాలు కూడా NASSCOM వారు ఇవ్వటం జరుగుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్. లోకనాథం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు మాట్లాడుతూ రానున్న రోజులో NASSCOM ఫీచర్ స్కిల్ల్స్ డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేసపెట్టి ఇండస్ట్రీ ప్రతినిధులకు విద్యాసంస్థల ద్వారా కావలసినటువంటి మ్యాన్ పవర్ ను వివిధ రకాలైనటువంటి ఏ ఐ ట్రైనింగ్స్ ద్వారా విద్యార్థులకు అకాడమిక్ పీరియడ్లోని ఉచిత శిక్షణను యిచ్చి ఇండస్ట్రీకి కావలసినటువంటి స్కిల్ మ్యాన్ పవర్ ఇవ్వడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేశారు. అలాగే జిల్లాలోని స్కిల్ హబ్స్ ద్వారా ఉచిత శిక్షణను ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రవీణ్, లీడ్ NASSCOM, ఏ పి యస్ యస్ డి సి కోర్దినేటర్స్ , మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *