Breaking News

అంతర్జాతీయ యోగ దినోత్సవం జయప్రదం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి అందరి సహకారం కావాలని మరియు యోగా అభివృద్ధికి ప్రధాని మోడీ విశిష్ట కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అంతర్జాతీయ యోగా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. 21వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ యోగాను విజయవంతం చేయాలని, యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా మోడీ ఫిట్నెస్ మంత్ర పై అవగాహన కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారుల సేవా సంస్థల మద్దతు లభిస్తుందని నిర్వహణ సమస్త యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల తెలిపారు. రుగ్మతలు తగ్గించడం ఇకముందు రోగాల బారిన పడకుండా సర్జరీలను తప్పించుకునేలాగా,జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ మానవులలో ఉన్న ప్రాణ శక్తి కేంద్రాలను, ప్రాణశక్తి క్షేత్రాలను చైతన్యపరచుకోవడం ద్వారా సాధించుకునే ఆరోగ్యం ఖర్చు లేదని ఎలాంటి సైడ్ లేనిదని ఇందులో ఆక్యుప్రెజర్ రోలర్ వాడకం,ఫుట్ రిఫ్లెక్స్యాలజీ చేసుకోవడానికి, బేర్ఫుట్ వాక్ బెనిఫిట్స్ తెలియజేయడం, ప్రాణప్రాణాయామలలో ఉత్తమ విధానాన్ని తెలియజెప్పి,ప్రాక్టీస్ చేయించడం,మెడిటేషన్ మరియు ఆసనాల పట్ల అవగాహన పెంచడం మరియు అంతర పంచభూతాలను సమస్థితి తెచ్చేలాగా పనిచేసే విధానాలను తెలిపి,వాళ్ళంతట వాళ్ళు చేసుకునేలాగా నేర్పడతాయని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్, డాక్టర్ మాకాల సత్యనారాయణ, యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్, డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, ఆస్పా భారత్ జాతీయ వైస్ ప్రెసిడెంట్, వంకదారి సుబ్బరత్నమ్మ , సెక్రెటరీ ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ, లైబ్రేరియన్స్ కొండ చిన్నపరెడ్డి, నంద్యాల నాగిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *