Breaking News

ఎమ్మెల్యే సుజనా చౌదరి ను పరామర్శించిన శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ను రాజకీయాలకతీతంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పరామర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం ఆదివారం సుజనా చౌదరి ను పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. హైదరాబాద్ లో తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన వద్దకు జకియా ఖానం తమ కుటుంబ సభ్యులతో వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *