-సోమరౌతు శ్రీనివాసరావు అధ్యక్షులు ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2025 పాఠశాల రేషనలైజేషన్ మరియు రీ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ కొరకు జీవో 19,20,21 విడుదల చేయడం జరిగింది. కమ్యునిస్టు భావజాలంతో నడపబడుతున్న ఉపాధ్యాయ సంఘాలు ప్రతి శుక్రవారం శుక్రవారం కమీషనర్ తో సమన్వయ సమావేశాలకు వెళ్లి చర్చలు జరిపారు. మున్సిపల్ పాఠశాలలకు 1800 పోస్టులు మంజూరు చేయడం జరిగిందని అది మావల్లే జరిగిందని ఒక రెండు రోజులు హంగామా చేశారు. ఇప్పుడు అంతా సజావుగా జరుగుతుందని అనుకునే సమయంలో అనేక రకాల డిమాండ్లు చేస్తూ ధర్నాలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా రేషనలైజేషన్ జరుగకుండా ఆగిపోయిన మున్సిపల్ పాఠశాలలకు ఈ రేషనలైజేషన్ వల్ల పిల్లల సంఖ్య ఆధారంగా కేడర్ స్ట్రెంత్ ప్రకారం 2020 పోస్టులు మంజూరు చేయడం జరిగింది. దీనిని బట్టి మున్సిపల్ పాఠశాలలలో వందల సంఖ్యలో బాలలు, భారీ సంఖ్యలో ఉపాధ్యాయుల కొరత ఉందనేది సుస్పష్టం అయ్యింది. అలాంటి అరకొర సౌకర్యాలతోనే మున్సిపల్ పాఠశాలలు అధ్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి. కనుక మొట్టమొదటిసారిగా మున్సిపల్ పాఠశాలలలో రేషనలైజేషన్ మరియు రీ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ టీచర్స్ ఈ ప్రక్రియ ఎక్కడ ఆగిపోతుందోననే ఆందోళనలో ఉన్నారు. కనుక జిల్లా పరిషత్తు ఉపాధ్యాయ సంఘాల పోరాటంతో, వారి డిమాండ్లతో మున్సిపల్ టీచర్స్ కి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాము. కనుక మున్సిపల్ పాఠశాలలకు పదోన్నతుల మరియు బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని, మున్సిపల్ ఉన్నత పాఠశాలలలో +2 ఏర్పాటు చేయాలని, మున్సిపల్ టీచర్స్ కి అంతర్ జిల్లా మరియు అంతర్ మేనేజ్మెంట్ బదిలీలు నిర్వహించాలని, మున్సిపల్ టీచర్స్ ఎడ్యుకేషనల్ యూనిఫైడ్ సర్వీసు రూల్సు విడుదల చేయాలని గౌరవ కమీషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News